S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

కలుకం పిచ్చయ్య, ఖమ్మం
మన దేశ జనాభా 1951లో 36 కోట్లు ఉంటే ఇప్పుడు 120 కోట్లకు పెరిగింది. ఇది శుభసూచకమా? జనాభా ఇలా పెరుగుతూ పోతే ఒనగూడేదేమిటి? ఇది సుభిక్షానికి సంకేతమా లేక దుర్భిక్షానికి సంకేతమా?
జనమే మన ఆస్తి. జనాభాలో యువత శాతమే హెచ్చుగా ఉండటం దేశ భవితకు శుభసూచకం. జనాభా పెరుగుదలను చూసి బెంబేలెత్తడం కాదు. జనశక్తిని సద్వినియోగం చేయటం ఎలాగన్నది ఆలోచించాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
తెలంగాణలో లాయర్లు, కోర్టు అధికారులు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు విభజన గురించి మీనమేషాలు లెక్కపెట్టడమేమిటి బి.జె.పి. ప్రభుత్వం? అమరావతికి అన్ని ఆఫీసులు వచ్చేశాయి, వచ్చేస్తున్నాయి. బాబుగారు ఇవన్నీ హైదరాబాద్ నుండి తరలించడానికి చూపిస్తున్న ఆసక్తి హైకోర్టు కూడా ఇక్కడకు రావడానికి ఇంటరెస్టు చూపించరెందుకు? 10 సం.ల వ్యవధి ఉన్నా అవన్నీ మారినప్పుడు హైకోర్టు విషయంలో జాప్యమెందుకు?
తాత్సారానికి అర్థంలేదు.

జయకర్, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో న్యాయాధికారులు, జడ్జిలు తమకి అన్యాయం జరిగిందంటూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం బాగుందా? కోర్టుల్లో తీర్పులు చెప్పకుండా రోజుల తరబడి నాన్చడం సామాన్య మానవుడు ఎవ్వరితో చెప్పుకొని బాధపడాలి?
ఔను. వీధి పోరాటాలు వారి పదవికి నప్పవు. తగవు.

కె.వి.దుర్గామోహనరావు, హైదరాబాద్
నిజాం సర్కార్ హయాంలో సైతం లేని కొత్త సంప్రదాయంగా ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా అట్టహాసంగా 12 కోట్ల రూపాయలు వెచ్చించి ఇఫ్తార్ విందులు రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేసింది. గతంలో క్రిస్మస్‌కు క్రిస్టియన్లకు కూడా బహుమతులు, వస్తద్రానాలు చేసింది. మరి హిందువులేం పాపం చేశారు. కార్తీక సమారాధనల లాంటివి హిందువులకు కూడా ఏర్పాటు చెయ్యవచ్చుగా? హిందువులెలాగైనా ఓట్లు వేస్తారని ధీమానా?
తమది అన్నిటికంటే పెద్ద ఓటు బ్యాంకు అన్న స్పృహ హిందువులకు లేదు. అది వారికి కలిగిననాడు అన్ని ప్రభుత్వాలూ వారి కాళ్ల దగ్గర ఉంటాయి. కులాలవారీగా చీలి ఉన్నంతకాలం హిందూ సమాజానికి భవిష్యత్తు లేదు.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
రంజాన్ తోఫాయి ఇవ్వంగా లేనిది హిందువుల పిల్లలకు చంద్రన్న కానుకగా దీపావళి టపాసులివ్వచ్చుగా?
ఇచ్చేట్టు చేయాల్సింది హిందువులే.

ఆర్.బి.ఐ. గవర్నర్ పోతానంటే పోనివ్వరాదుటండీ. నోబడి ఈజ్ ఇన్‌డిస్పెన్సబుల్.
ఎవరు ఆపుతున్నారు?

అసంఘటిత కార్మికుల కనీస వేతనం పది వేలుండాలని ఒక నేత అంటే మరొకరు 18 వేలు ఉండాలంటారు. మార్కులు కొట్టేయటానికి కదా ఈ తిప్పలు.
పోచుకోలు కబుర్లు.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
రంజాన్ నెలలో మన ప్రభుత్వాలు అధికారపూర్వకంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులిస్తాయి. ఇది -సెక్యులరిజమా?
‘పెక్యులరిజం’

గూటూరు శ్రీహరిరావు, గంగవరం, నెల్లూరు జిల్లా
తెలుగు సినిమా సంగీతంలోంచి ఘంటసాల వారిని మినహాయిస్తే - మీ కామెంట్ ప్లీజ్!
చంద్రుడు లేని వెనె్నల.

మోదీగారి పాలన ఎలా ఉందంటారు?
ఇప్పటిదాకా ఓకే.

బావన సీతారాం, మందసా, కమలాపురం
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు (సర్పంచులకు) లేని అధికారం ఎన్నికలలో ఓడిపోయిన అధికార పార్టీ సభ్యులకు జన్మభూమి గ్రామ కమిటీ పేరున కట్టబెట్టడం ప్రజాస్వామ్య పరిపాలన అనిపించుకుంటుందా?
అది ప్రజాస్వామ్య వంచన.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
తెలుగు రాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు, విడిపోయిన తరువాత అమరావతికి మారింది. రాయలసీమవారూ తమ రాష్ట్రాన్ని సాధించుకుంటే మరల ఇంకో రాజధాని అవసరం రావొచ్చు గదండి.
రాదు. అమరావతి రాయలసీమలో లేదు.

నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
తెలుగు సినిమా సమీక్షలలో అనువాద చిత్రాలు (డబ్బింగ్) అయితే ఆ విధంగా దయచేసి పేర్కొనగలరు. ప్రత్యక్షంగా తీసిన చిత్రాలు కావు అని అర్థం అవుతుంది. కేవలం నటీనటుల పేర్లు ప్రకారం డబ్బింగ్ అని అన్నిసార్లూ గుర్తించటం కుదరటం లేదని మనవి.
అలాగే.
***

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com