S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాటై ప్రవహించిన కవీ! ( అక్షరాలోచనాలు)

అంజన్నా!
మట్టిలోంచి వచ్చిన మాణిక్యానివి నీవు
పొలం గట్టున పరిమళించిన మొగలి పువ్వువి నీవు
కూడులేని వారి కోసం
గుడ్డలేని వారి కోసం
గూడులేని వారి కోసం
పాట కట్టిన ప్రజాకవివి నీవు
పాట పాడిన ప్రజా గాయకుడివి నీవు
నీ జీవితమంతా
చీకటితో పోరాటం
నీ బ్రతుకంతా
పాటై ప్రవహించింది
గుడిసెల్లోని జనం కోసం
నీవు కలం పట్టావు
చెట్ల కింది సంసారాల కోసం
నీవు పాట పాడావు
దొరతనంపై ఎత్తిన
వజ్రాయుధం నీ పాట
అవినీతిని కుళ్లబొడిచిన
అంకుశం నీ పాట
పల్లె జనానికి మేలుకొలుపు
నీ పాట
ప్రజోద్యమాలకు ప్రాణ వాయువు
నీ పాట
యువతకు చైతన్యం
నీ పాట
జనతకు నైవేద్యం
నీ పాట
తెలంగాణ తల్లి వెతల్ని
వలవల ఏడుస్తూ పాడిన
తెలంగాణ బిడ్డవు నీవు
తెలంగాణ మట్టి పౌరుషాన్ని
దుర్మార్గుల గుండెలదిరేలా ఆలపించిన
విప్లవాగ్నివి నీవు
తెలంగాణ ప్రజలకు
మేలుకొలుపు పాటవు నీవు
తెలంగాణ జనావళికి
వెలుగు బాటవు నీవు
ఎందరు కవులు లేరు
ఏరీ నీలా పాటై ప్రవహించినవారు?
ఎందరు కళాకారులు లేరు
ఏరీ నీలా జనానికి కవిత్వాన్ని
అంకితం చేసినవారు
‘సుకవి జీవించె ప్రజల నాలుకల యందు’
అన్న మహాకవి మాటకు
నీవే నిలువెత్తు సాక్ష్యం
అంజన్నా! నీవు లేవు
నీ పాట ఉంది, ఉంటుంది
కలకాలం.
*
(తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్య
అస్తమించారన్న వార్త విని)

-తిరునగరి 9392465475