S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాలీవుడ్ ఆశలేదు!

-అంటోంది అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్. ‘ఏ నటికైనా టార్గెట్ బాలీవుడ్డే కదా’ అని ఎవరైనా ప్రశ్నిస్తే- ‘‘కావొచ్చు. కానీ, నాకు మాత్రం కాదు. నాకు టాలీవుడ్‌లోనే ఎంతో ఆదరణ లభిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. అంతకంటే ఎక్కవ ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం మరచిపోలేనిది. ఎలాంటి ఆశలూ.. ఆశయాలు లేకుండానే వెండితెరపై అడుగుపెట్టాను. నా అదృష్టం కొద్దీ మంచి చిత్రాలు.. మంచి క్యారెక్టర్స్ లభిస్తున్నాయి. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి? చెప్పండి? ఇక నెంబరింగ్ అంటారా? నాకు అలాంటి అత్యాశలేం లేవు. ఏ నటికి నేను పోటీకాను. నా చిత్రాలు నావే..నా దారి నాదే’’ అంటోంది. ఎంతకాలం పరిశ్రమలో నిల్చున్నామన్నది కాదు..ఎన్ని మంచి చిత్రాలు చేశాం..ఎన్ని గుర్తిండిపోయే పాత్రల్లో కనిపించాం అన్నదే ముఖ్యమంటున్న రకుల్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అందుకే అతి కొద్దికాలంలోనే టాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. దటీజ్..రకుల్!!

-సమీర్