S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కడెం ప్రాజెక్టును సందర్శించిన డ్యామ్ సేఫ్టీ బృందం సభ్యులు

కడెం, జూలై 19: ఆదిలాబాద్ జిల్లాలోని అతిపెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఎస్‌డిఎస్ ఐటి సైట్ డ్యామ్ సేఫ్టీ తనిఖీ కమిటి బృంధం సభ్యులు కె.సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ ఛీఫ్ రిటైర్డ్ డ్యామ్ సేఫ్టీ కమిటి మెంబర్, రిటైర్డ్ సిఈ మెకానికల్ సురేష్‌వార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసులు, డ్యామ్ సేఫ్టీడివిజన్ సభ్యులు వేణుగోపాల్, కమిటి సభ్యులు జెఈ అమృత్, జెఈ శ్రీనివాస్‌రెడ్డి, సందర్శించారు. ఈ సందర్బంగా ప్రాజెక్టు జలాశయానికి చెందిన గేజ్‌రూమ్‌లోకి వెళ్లి బృందం సభ్యులు నీటిమట్టాన్ని పరిశీలించారు. అనంతరం కడెం ప్రాజెక్టుకు చెందిన 18 వరదగేట్లను పర్యటిస్తూ ప్రతీగేటు వద్దకు వెళ్లి గేట్ల పనితీరును బృంధం సభ్యులు తనిఖీ చేశారు. వర్షాకాలం సీజన్‌లో వరదగేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా, ఏమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఇబ్బందులు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలపై సభ్యులు ఆరాతీశా రు. కడెం ప్రాజెక్టువద్ద నెలకొన్న సమస్యలపై పలు ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప నుల విషయంపై తదితర అనేక విషయాలపై నీటిపారుదలశాఖ అధికారులను కమిటి బృంధం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు భద్రతపై తీసుకోవాల్సిన సలహాలను, సూచనల ను తెలిపారు.