S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జలకళతో ఉట్టిపడుతున్న మిషన్ కాకతీయ చెరువులు

ఇచ్చోడ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులు సత్పలితాలను ఇస్తున్నాయి. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఈ చెరువులలో నీరు చేరి నిండుకుండలా తలపిస్తున్నా యి. మండలంలోని ఎల్లమ్మకుంట, గే ర్జం, సిరిచెల్మ, సిరికొండ గ్రామాలలో చెరువులకు పునరుద్దరణ పనులు చేపట్టారు. గతంలో ఈ చెరువులు కేవలం పేరుకు మాత్రమే ఉండగా వీటివల్ల రై తులకు, ప్రజలకు ఎలాంటి ప్రయోజ నం కలగకపోగా, కనీసం ఈచెరువుల్లో పూడిక తీయకపోవడంతో నీరు సైతం నిల్వ ఉండేదికాదు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో మండలానికి 5 చె రువుల పునరుద్దరణకుగాను రూ. 3 కోట్ల 5లక్షల నిధులు మంజూరు చేయ గా ఎల్లమ్మకుంట చెరువుకు రూ. 74 ల క్షలు, గేర్జం చెరువుకు రూ. 84 లక్షలు, సిరిచెల్మ చెరువుకు కోటి 24 లక్షల నిధులు మంజూరి చేసింది. ఈ చెరువు లకింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు భూములకు నీరు అందే అవకాశం ఉంది. మొదటి విడతలో ఈ చెరువుల పునరుద్దరణ పనులు పూర్తికావడంతో ఈఏడాది కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో ఆయకట్టు భూములకు నీరు అందడమే కాకుండా రా నున్నరోజుల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటి ఇబ్బందులు ఉండకపోవచ్చ ని ప్రజలు అంటున్నారు. నిజాం, కాకతీయులనాటి చెరువులకు మరమ్మత్తు లు చేపట్టడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి.