S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

21న ఛలో జోడేఘాట్

తిర్యాణి, జూలై 19: జోడేఘాట్‌తో కూడిన కొమురంభీం జిల్లా సాధన కోసం ఈనెల 21న ఛలో జోడేఘాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు గెడెం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సోయం ఇందూరాంలు తెలిపారు. ఈసందర్బంగా మంగళవారం తి ర్యాణిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జోడేఘాట్ ప్రాం తాన్ని విస్మరించి కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాకు కొమురంభీం జిల్లాగా నామకర ణం చేయడం సమంజసం కాదన్నారు. జోడేఘాట్ ప్రాంతాన్ని కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో ఉంచినపుడే దానికి కొమురంభీం జిల్లా పేరు పెట్టే అర్హత లభిస్తుందన్నారు. జోడేఘాట్‌తో కూడిన జిల్లా సాధనకై ఈనెల 21న అత్తిని నుంచి జోడేఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం జోడేఘాట్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వారు కోరారు. సమావేశంలో ఆదివాసీ జేఏసీ మం డల నాయకులు తెలంగ్‌రావు, గుణవంత్‌రావు, బాజీరావు, బిందర్‌షా, రాము, గో వర్దన్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుస్టేషన్‌లో మొక్కల పంపిణీ
బెల్లంపల్లి, జూలై 19: పట్టణంలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో బెల్లంపల్లిలో విజయవంతంగా సాగుతోందన్నారు. కార్యక్రమంలో ప్రతీఒక్క రు పాల్గొనాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు దోహదపడాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా ఆ మొక్కలను కాపాడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో 500 మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్సై గంగారాజం గౌడ్, ఏఎస్సైలు రమేష్, ఖాదర్ పాషా, కానిస్టేబుళ్లు నర్సయ్య, తిరుపతి పాల్గొన్నారు.