S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాగుచేసుకుంటున్న భూముల కోసం.. గిరిజనుల ఆందోళన

కడెం, జూలై 19: కడెం మండలంలోని పాండ్వాపూర్ గ్రామ సమీపంలోగల గత అటవీ భూమిలో గత 25 సంవత్సరాల ను ండి పాండ్వాపూర్,గోండుగూడెం గ్రామానికి చెందిన దాదాపు 25 గిరిజన కుటుంబాలు సర్వే నంబర్ 111గల భూముల్లో సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా ఈ భూమిలో గత రెండు మూడు రోజులనుండి అటవీశాఖ అధికారులు తమ అటవీ భూమియంటూ గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో హరితహారం పథకం పేరుతో మొక్కలు నాటడానికి యంత్రాలతో కందకాలు తవ్వకాలు ప్రారంభించారు. ఈ భూమిలో సో మవారం సాయంత్రం పంటలు సాగుచేయడానికి గోండుగూడెంకి చెందిన గిరిజనులు చిన్నగా పెరిగిన పొరక మొక్కలను తొలగిస్తుండగా కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కడెం రేంజ్ అటవీశాఖ రేంజ్ సిబ్బంది ఈ భూమిలోకి వెళ్లి గిరిజనులను కడెం రేంజ్ కార్యాలయానికి తీసుకవచ్చారు. అటవీశాఖ అధికారులు రేంజ్ కార్యాలయంలో వారిని నిర్భంధించ గా మంగళవారం ఈవిషయం తెలుసుకు న్న పాండ్వాపూర్, గోండుగూడెం గిరిజను లు పెద్దఎత్తున కడెం రేంజ్ కార్యాలయాని కి తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తాము సా గుచేసిన భూమి తమకే దక్కాలని తమపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, తాము సాగుచేసుకుంటున్న భూములకు ఐటిడిఎ పివొ సర్వే చేయించారని, తమకు అటవీహక్కు పత్రాలు మం జూరుకావడానికి సిద్దంగా ఉన్నాయంటూ వారు ఆరోపించారు. ఈ సమాచారం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు దుర్గం నూతన్‌కుమార్, టిఆర్‌ఎస్ పార్టీ జి ల్లా నాయకులు బుక్యబాపురావు, కడెం మండల అధ్యక్షులు నల్లజీవన్‌రెడ్డి, కొండుకూర్ సర్పంచ్ మల్లేశ్వరి రాజవౌళి,అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అర్ల రమేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షు లు పసుల రాజలింగం, గిరిజనులు ఆం దోళన చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్‌చేశారు. ఇక్కడ 20ఏళ్ల నుండి సాగుచేసుకుంటున్నామని, ఈ భూములు వారికే దక్కేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం గిరిజనులను అదుపులోకి తీసుకుని మహిళలు, చంటిపిల్లలని చూడకుండా కడెం రేంజ్ కార్యాలయంలో నిర్భంధించి ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వ రకు గిరిజనులు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈవిషయంపై కడెం ఎఫ్‌ఆర్‌వొ నాగయ్యకు విలేకర్లు వివరణ కోరగా కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్‌గుప్త ఆదేశాల మేరకు పాండ్వాపూర్ అటవీభూమిలో చెట్లను తొలగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని 16 మంది వైల్డ్‌లైఫ్ చట్టం కింద కేసులు నమోదుచేయడం జరిగిందని ఎఫ్‌ఆర్‌వొ నాగయ్య పేర్కొన్నారు.