S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జూలై 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మూలధన సాయంగా 23 వేల కోట్ల రూపాయలను అందించడం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 40.96 పాయింట్లు పెరిగి 27,787.62 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.85 పాయింట్లు అందుకుని 8,528.55 వద్ద నిలిచింది.
చమురు, గ్యాస్, ఎనర్జీ, పవర్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాల షేర్ల విలువ 1.90 శాతం నుంచి 0.37 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ సూచీలు నష్టపోతే, చైనా, తైవాన్ సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టపోయాయి.

వచ్చే స్పెక్ట్రమ్ వేలంలో
పాల్గొనం: టెలినార్
న్యూఢిల్లీ, జూలై 19: రాబోయే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనబోమని ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ టెలినార్ ప్రకటించింది. అయితే మరికొంత కాలం తక్కువ ధరలకే సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్‌లో తమ వ్యాపారానికి ప్రత్యామ్నాయాలను కూడా అనే్వషిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఇక్కడ తమ గ్రూప్ ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా టెలినార్ గ్రూప్ సిఇఒ సిగ్వే బ్రెక్కీ మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా, త్వరలో ప్రారంభమయ్యే రిలయన్స్ జియో టెలికామ్ సేవలు తమ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పడం గమనార్హం.

టెలికామ్ సంస్థలకు
రూ. 110 కోట్ల డిమాండ్ నోటీసు

న్యూఢిల్లీ, జూలై 19: ఆరు టెలికామ్ సంస్థలకు 110 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసును జారీ చేసింది టెలికామ్ శాఖ. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వొడాఫోన్, టాటా టెలీసర్వీసెస్, ఐడియా, ఎయిర్‌సెల్‌కు ఈ నోటీసులను ఇచ్చింది. 2006-10 ఆర్థిక సంవత్సరాల సమయంలో 46,045.75 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ఈ ఆరు సంస్థలు తక్కువజేసి చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలియజేసినది తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 12,488.93 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కూడా తెలిపింది. ఈ క్రమంలోనే టెలికామ్ శాఖ తాజా నోటీసులు జారీ అయ్యాయి.

‘ఆర్‌బిఐ గవర్నర్‌ను నియమించేది
ప్రధాని కార్యాలయమే’

న్యూఢిల్లీ, జూలై 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సిఫార్సుపై ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్‌ఒ) నియమిస్తుందని మంగళవారం పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఆర్‌బిఐ గవర్నర్ నియామకాన్ని ఆర్థిక మంత్రి సిఫార్సుపై ప్రధాని కార్యాలయం ఆమోదిస్తుంది.’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అయితే ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ల నియామకం మాత్రం అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఎసిసి) మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. కానీ సెర్చ్ కమిటీ పేరు మాత్రం ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్ సెర్చ్ కమిటీ (ఎఫ్‌ఎస్‌ఆర్‌ఎఎస్‌సి)గా మార్చినట్లు పేర్కొన్నారు. ఆర్‌బిఐ గవర్నర్, డిప్యూటి గవర్నర్ల కోసం ఈ కమిటీ పలువురి పేర్లను సిఫార్సు చేస్తుందని, ఆర్థిక రంగ రెగ్యులేటరీ వ్యవస్థల చైర్‌పర్సన్, సభ్యుల నియామకాల కోసం కూడా పేర్లను సూచిస్తుందని వివరించారు.

అల్ట్రాటెక్ లాభం రూ. 780 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 19: అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 29 శాతం పెరిగి 780.11 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 603.72 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 6,589.71 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,341.41 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు మంగళవారం అల్ట్రాటెక్ తెలిపింది. ఇదిలావుంటే వచ్చే ఏడాది మే నాటికి జైపీ గ్రూప్ డీల్ ముగియవచ్చంది. ఈ ఏడాది మార్చిలో జైపీ గ్రూప్‌నకు చెందిన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ల్లోని సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేస్తున్నట్లు అల్ట్రాటెక్ ప్రకటించినది తెలిసిందే. 21.20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లను 16,189 కోట్ల రూపాయలకు దక్కించుకుంటోంది. కాగా, వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, 7వ వేతన సంఘం సిఫార్సులు అమలుతో గ్రామీణ హౌజింగ్ పుంజుకుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో అభివృద్ధి కార్యకలాపాలు ఊపందుకున్నాయంది.