S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రాజకీయ ప్రయోజనాల కోసమే మల్లన్నసాగర్’

హైదరాబాద్, జూలై 19: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగితే దానిని ఎవరూ వ్యతిరేకించరని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ అవరసమా? ఎవరికోసం మల్లన్న సాగర్? అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ జేఏసి కన్వీనర్ ప్రొ కోదండరాం, ప్రొ.హరగోపాల్, రమా మెల్కొటే, విమలక్క మాట్లాడుతూ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఏప్రాతిపాదికన డబ్బులు చెల్లిసున్నారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు అప్పటి ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందో తెలియదన్నారు.ప్రాజెక్టు డిజైను మొదలు కాకముందు నుంచే భూసేకరణ మొదలు పెట్టారని, భూనిర్వాసితులు అక్కడి ప్రజాప్రతినిధులను ప్రశ్నించగా తమ పరిధిలో లేని విషయమని స్పష్టం చేసినట్లు తెలిపారు. తాము వారిని ప్రశ్నించగా, మీరేమైనా ఇంజనీర్లా, లేక నిపుణులా? మీకు ఇలాంటి విషయాలు ఎలా అర్థమవుతామని ఎదురు దాడికి దిగుతున్నారని తెలిపారు. నీటి పారుదల రంగ నిపుణుడైన టి. హనుమంతరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్కు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలను ఒప్పించి వారికి ఎలాంటి హాని కలగకుండా ప్రాజెక్కులు నిర్మించుకోవాలన్నారు. జేఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ నిర్వాసితుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని, వారి పట్ల ప్రభుత్వం, న్యాయ, చట్టబద్దంగా వ్యవహారించాలని అన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి, సంతకాలు తీసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు.