S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవకాశాల సాంస్కృతిక కేంద్రంగా బ్రిటిష్ లైబ్రరీ

హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్‌లోని బ్రిటిష్ లైబ్రరీని అవకాశాల సాంస్కృతిక కేంద్రంగా విస్తృత పరుస్తున్నట్టు జాతీయ డైరెక్టర్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అలన్ గమ్మెల్ చెప్పారు. డైరెక్టర్ అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చి స్థానిక బ్రిటిష్ లైబ్రరీని సందర్శించారు. దేశవ్యాప్తంగా 9 బ్రిటిష్ లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలను బ్రిటన్ నిర్వహిస్తోందని, కళలు, విద్య, అంతర్జాతీయ స్థాయి పరీక్షలు, ఆంగ్లభాషా బోధన, నైపుణ్యాలను నేర్పించేందుకు ఈ కేంద్రాలను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. లక్ష మందికి పైగా రెగ్యులర్ సభ్యులు ఈ కేంద్రాలను సందర్శించి జీవన కళలలను మెరుగుపరుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మరో పక్క విద్యార్ధులకు, ఆంగ్లభాషా బోధకులకు అనునిత్యం శిక్షణ కౌశలాలు అందిస్తూ వారిలో ప్రతిభాపాటవాలను పెంపోందించేందుకు అనేక రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నామని అన్నారు. బ్రిటన్‌లో చదువుకునేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్, ఫెల్లోషిప్ ప్లాన్, చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్టు అవార్డులు అందజేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ బ్రిటిష్ లైబ్రరీ ముఖచిత్రం మారుస్తామని, దానిని నిరంతరం యువతకు ఉపయోగపడే వినూత్న వైజ్ఞానిక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం లైబ్రరీలో 10వేల పుస్తకాలు, డివిడిలు, ఆడియో పుస్తకాలు, 50 ఏళ్ల జర్నల్స్, 4వేల ఇ న్యూస్ పేపర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.