S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసెంబ్లీలో హరిత హారం మొక్కలు నాటిన స్పీకర్, చైర్మన్

హైదరాబాద్, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో భాగంగా శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి మొక్కలు నాటారు. మంగళవారం చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనా చారి, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్, జాయింట్ సెక్రటరీ నరసింహా చారి తొలుత ఎమ్మెల్యే క్వార్టర్లకు వెళ్ళి మొక్కలు నాటారు. అక్కడి నుంచి వారు నేరుగా కౌన్సిల్ ఆవరణకు చేరుకుని మొక్కలు నాటారు. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనా చారి ప్రసంగిస్తూ వరంగల్‌లో తమ కుటుంబంలో 75 మంది హరిత హారంలో పాల్గొన్నామని చెప్పారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ హిందువులు దేవాలయానికి వెళతారని, క్రిస్టియన్లు చర్చికి వెళతారని, ముస్లింలు మసీదుకు వెళతారని అయితే నీడను, ఆక్సిజన్‌ను ఇచ్చే చెట్లు కుల, మతాలు చూడవని అన్నారు.

మెడికల్ అడ్మిషన్లలో మార్పు లేదు
25నుంచి మెడికల్ ,
డెంటల్ సీట్ల కౌనె్సలింగ్
1నుంచి వెబ్ ఆప్షన్లు, అడ్మిషన్లు
మంత్రి లక్ష్మారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 19: మెడికల్ అడ్మిషన్ల షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. మెడికల్ ఎమ్సెట్-2 పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడం, అడ్మిషన్లపై విద్యార్థుల్లో గందరగోళం చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 25వ తేదీ నుండి కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ వైస్ చాన్సలర్ డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో జెఎన్‌టియు, ఉస్మానియా యూనివర్శిటీ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీతో పాటు ఆంధ్రాలో విజయవాడ ఎన్‌టిఆర్‌యుహెచ్‌ఎస్‌లో కూడా సర్ట్ఫికెట్ల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జనరల్ కేటగిరీకి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందని, పిహెచ్, ఆర్మీ, స్పోర్ట్స్ కేటగిరి అభ్యర్థులకు మాత్రం ఈ నెల 30, 31 తేదీల్లో సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు.
ఆగస్టు మొదటి వారంలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 3560 మెడికల్ సీట్లు, 1280 డెంటల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే వీటిలో 50 శాతం మాత్రమే కన్వీనర్ కోటాకింద భర్తీ చేస్తామని, మిగిలిన 50 శాతం సీట్లను నీట్ ర్యాంకుల ద్వారా భర్తీచేస్తారని వివరించారు. 1780 మెడికల్ సీట్లు, 640 డెంటల్ సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
24 నుండి తుది దశ
ఇంజనీరింగ్ కౌనె్సలింగ్
ఈ నెల 24 నుండి తుది దశ ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి తెలిపారు. తొలి ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ ఈ నెల 24, 25 తేదీల్లో ఆప్షన్లను ఇవ్వవచ్చని చెప్పారు. 27వ తేదీ రాత్రి 8 గంటలకు తుది దశ సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని పేర్కొన్నారు.