S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతీ గ్రామంలో మత్య్స సంపద అభివృద్ధి

శ్రీకాకుళం, జూలై 21: ప్రతీ గ్రామంలోనూ మత్స్య సంపద పెంపొందేలా మత్స్యశాఖ, పంచాయతీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో మత్స్య అభివృద్ధిపై సమీక్షించారు. గ్రామాల్లో ఓ పదిమంది కలిసి మత్స్యకారుల సంఘాన్ని ఏర్పరచుకొని ఆ గ్రామంలోని చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టాలన్నారు. మత్స్యకారులతోపాటు ఎస్సీ, ఎస్టీలు కూడా సంఘంలో భాగస్వామ్యులుగా ఏర్పడవచ్చునన్నారు. చెరువుల్లో, పంట కుంతల్లో చేపల పెంపకాన్ని విరివిగా చేపట్టాలన్నారు. సంఘాలకు వచ్చిన ఆదాయం కూడా 25శాతం పంచాయతీలకు, 75శాతం సంఘాలకు అందించడం జరుగుతుందన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో సంఘాలు ఏర్పరచుకోవడం వలన అదే గ్రామంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పంచాయతీ అధికారులు చెరువులను గుర్తించాలని, చేపపిల్లలను మత్స్య శాఖ వారు అందించాలని తెలిపారు. చేప పిల్లల పెంపకం అభివృద్ధి పరిచే బాధ్యత పంచాయతీలదే అన్నారు. గ్రామపంచాయతీ చెరువుల్లో చేపలపెంపకం చేపట్టేందుకు పంచాయతీ అధికారులు, మత్స్యశాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ ఉపసంచాలకులు కృష్ణమూర్తి, సహాయ సంచాలకులు నిర్మల, ఎఫ్ డి వోలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.