S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాలిక్యులర్ మోడలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

జగదాంబ, జూలై 21: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ మోడలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఏయూ ఫార్మశీ కళాశాలలో ‘ప్రిన్సిపాల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మాలిక్యులర్ మోడలింగ్ ఇన్ టీచింగ్ అండ్ రీసెర్చ్’ జాతీయ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మోడలింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు నమూనాను సత్వరమే అందించాలని ఏయూ ఫార్మశీ విభాగాన్ని కోరారు. ఆరు మాసాల్లో సెంటర్ తన సేవలను ప్రారంభించాల్సి ఉందన్నారు. ఐఐసిటి భాగస్వామ్యాన్ని స్వీకరిస్తూ పటిష్టంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. ఫార్మా సంస్థల నుంచి అవసరమైన సహకారాన్ని తీసుకోవాలన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మశీ వంటి విభిన్న శాస్త్ర నిపుణులను సమన్వయం జరుపుతూ ఒక బృందాన్ని తయారు చేయాలన్నారు. నేడు ప్రతీ వ్యక్తి మాలిక్యులర్ మోడలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో మెరుగైన జ్ఞానాన్ని ప్రోదికొల్పడానికి ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు. కంప్యూటర్ సాంకేతిక ఫలితంగా మాలిక్యుల్స్ స్థిరత్వం, శక్తిని సులభ విధానాల్లో తెలుసుకోవడం సాధ్యపడిందన్నారు. ఈ కార్యక్రమంలో సహ కన్వీనర్లు ఆచార్య వై.రాజేంద్రప్రసాద్, వి.గిరిజశాస్ర్తీ, డాక్టర్ కె.పూర్ణనాగశ్రీ, ఆచార్య వెంకటరావు, బి.గంగారావు, సాంబశివరావు, శర్మ తదితరులు పాల్గొన్నారు.