S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చంద్రబాబు సభ విజయవంతం చేయండి

అచ్యుతాపురం, జూలై 21: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా అచ్యుతాపురం వస్తున్న నారా చంద్రబాబునాయుడుకు అఖండ ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పిలుపునిచ్చారు. గురవారం స్థానిక డ్వాక్రా భవనంలో జరిగిన నియోజక వర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని మాట్లాడుతూ ఈ నెల 23న పూడిమడకలో ఇన్ఫోసిస్ నిర్మించి గృహాసముదాయాల ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కార్యకర్తల మాత్రమే స్వాగతం పలకాలని హుకుం జారీ చేశారు. నియోజకం వర్గంలో పలు సమస్యలతో పాటు సెజ్ నిర్వాసితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్తానన్నారు. ఐదువేల మంది కార్యకర్తలతో మాత్రమే సభ జరుగుతుందన్నారు. సిఎం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని, జిల్లా నాయకులతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న తరువాత రెండున్నర గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి అచ్యుతాపురం బ్రాండిక్స్‌కు వస్తారని, అక్కడ నుండి వాహనంలో బయలుదేరి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ. 1.10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మరో రెండి కంపెనీలకు శంకుస్థాపన చేపట్టిన తరువాత నేరుగా ఇన్ఫోసిస్ సొంత నిధులతో హుధూధ్ భాదితులకు నిర్మించిన రెండు వందల పక్కాగృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారన్నారు. అలాగే ప్రభుత్వం నిధులతో మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న 400 వందల ఇండ్లకు సంకుస్థాపన చేస్తారన్నారు. తురువాత బ్రాండిక్స్ మహిళల సమస్యలపై కంపెనీలో జరిగే సమావేశంల పాల్గొంటారన్నారు. తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్లి అధికారులతోను, ప్రజాప్రతినిధులతో జిల్లా సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. సెజ్, నేవల్ నిర్వాసితుల సమస్యలపై సిఎం దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. అదిరిపోయే ప్లేక్సీలతో దారి పొడవనా కట్టి ఘనస్వాగతం పలకాలని కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి, మునగపాక మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.