S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్యాగం వృథా కాదు!

గూడెంకొత్తవీధి, జూలై 21: అమరులైన మావోయిస్టుల త్యాగాలు వృథాగా పోవని ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంత మావోయిస్టు నాయకులు పేర్కొన్నారు. ఎ. ఓ.బి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 40 అడుగుల భారీ స్థూపాన్ని అవిష్కరించారు. అమరులైన మావోయిస్టు నేతలైన రవి, ఆజాద్, శరత్, ఆనంద్, గణపతి, కమలల జ్ఞాపకార్ధం భారీ స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వారోత్సవాల్లో మావోయిస్టు నాయకులు మాట్లాడుతూ పోరాటాలు చేసే వారికి వీర మరణం తప్పదని, వారి త్యాగాల ఫలితమే ఆదివాసీ గిరిజనులు సుఖ సంతోషాలుతో ఉంటున్నారని పేర్కొన్నారు. అమరులైన మావోయిస్టు నేతల వలన ఏజన్సీలో కాఫీ తోటల పంపకం జరిగిందన్నారు. వాటి పలితాలను గిరిజనులు అనుభవిస్తున్నారన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు పరోక్ష ఉద్యమం చేయడం వలనే నేడు ప్రభుత్వం బాక్సైట్ వెలికి తీతకు వెనుకంజ వేస్తోందన్నారు. మరలా ప్రభుత్వాలు బాక్సైట్‌ను తీసేందుకు ముందుకు వస్తున్నాయని, వీటిని ప్రతీ ఒక్కరూ ప్రతిఘటించాలన్నారు. మావోయిస్టు నేతలు పోరాటాలు చేస్తున్నప్పుడు మరణించడం తప్పని సరని, వారు చేసిన త్యాగాలు, కృషిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఎంత మంది మావోయిస్టులు మరణిస్తే అంత మంది వీరులు పుడతారని వీటికి మావోయిస్టు పార్టీ వెనుకంజ వేయదని మావోయిస్టు నేతలు పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరు వీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని గ్రామగ్రామాన మావోయిస్టు జెండాను ఎగురవేసి అమరులైన నేతలకు ఘన నివాళ్ళులర్పించాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. వారోత్సవాలు జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున ఎర్ర జెండాలను కట్టారు. లొంగిపోయే వారు బలహీనులని, పోరాటం చేసేవారు తుపాకీ పట్టుకుని ఆదివాసీలకు అండగా నిలుస్తారని, ఏజన్సీలో కాఫీ తోటలన్నీ అదివాసీ ప్రజలదేనని ఆ బ్యానర్లలో మావోలు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాల్లో కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల నుంచి సుమారు 800లకు పైగా ఆదివాసీ గిరిజనులు హాజరయ్యారు.