S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీటి వాడకంపై లెక్కలు

సీలేరు, జూలై 21: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం బలిమెలలో సమావేశమై నీటి వాడకంపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం బలిమెల జలాశయంలో ప్రస్తుతం 54 టిఎంసిలు నీటి నిల్వలున్నట్లు లెక్కలు తేల్చారు. ఈనీటిలో ఆంధ్రా వాటాగాను 3.4094 టిఎంసిల నీటిని వాడుకోవాలని, మిగతా 50.5906 టిఎంసిల నీరు ఒడిశా వాటాగా వాడుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది 2015 జూలై 1 నుంచి ఈ ఏడాది 2016 జూన్ 30 వరకు ఉన్న నీటి సంవత్సర లెక్కల ప్రకారం బలిమెల జలాశయం నుండి ఆంద్రా వాటాగా 82005 టి.ఎం.సి.ల నీటిని వినియోగించుకోగా ఒడిశా కేవలం 34.8244 టి.ఎం.సి.లు మాత్రమే 2016 జూలై వరకు వాడుకుంది. దీని ప్రకారం గత ఏడాది లెక్కల ప్రకారం ఒడిశా కన్నా ఆంధ్రా 471736 టి. ఎం.సి.ల నీటిని అధికంగా వినియోగించుకుంది. ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఏ ఏరాష్ట్రాలు ఎంతెంత నీటిని వినియోగించుకున్నాయో సమీక్షా సమావేశంలో లెక్కలు తేల్చారు. ప్రస్తుత అవసరాల నిమిత్తం ఒడిషా 500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేందుకు సీలేరు కాంప్లెక్స్ అవసరం నిమిత్తం 2,800 క్యూసెక్కుల నీటిని ఈనెలాఖరు వరకు వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన బలిమెల ఎలక్ట్రికల్ ప్రాజెక్టు సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.కె. ఫణి, సీలేరుకు చెందిన ఎస్. ఇ. సివిల్ మురళీమోహన్, ఇ.ఇ.వి.ఎల్.రమేష్ పాల్గొన్నారు.