S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగస్టు 15లోగా హరితహారాన్ని పూర్తి చేయాలి

మంచిర్యాల, జూలై 22: ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడమేకాక వాటి సంరక్షణర బాధ్యత చర్యలుకూడా తీసుకోవాలని మెప్మా అడిషనల్ డైరెక్టర్ వందన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని తూర్పు జిల్లా మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీర్లు, అర్బన్ ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంచేసేలా మంత్రి కెటిఆర్ ప్రణాళిక రూపొందించారన్నారు. ఆగస్టు 15లోగా హరితహారం కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లో విజయవంతం చేయాలన్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో మొక్కలునాటి వాటి సంరక్షణ చర్యలు అధికారులు, ప్రజాప్రతినిదులు దత్తత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 72మున్సిపాలిటీల్లో కోటి మొక్కలు నాటామని తెలిపారు. మున్సిపాలిటీకి ప్రభుత్వం నిర్ణయించిన 1.60లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1.10లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 80వేలకు గాను 42వేల మొక్కలు నాటారని, మందమర్రి మున్సిపాలిటీలో 15వేలఒకు గాను పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు. అదనంగా మరో 15వేల మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.