S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష కోట్లు లక్ష్యం

కోల్‌కతా, జూలై 22: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. 2030 నాటికి ప్రతిష్ఠాత్మకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్) జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైసి దేవేశ్వర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారం వృద్ధిపథంలోనే కొనసాగుతోందని చెప్పారు. బహుళ వ్యాపార సంస్థ అయిన ఐటిసికి పొగాకు వ్యాపారం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో సంస్థ పొగాకేతర వ్యాపార వృద్ధి.. పొగాకు వ్యాపారం కంటే పెరగాలన్న సూచనలను ఆయన తిరస్కరించారు. 1996 నుంచి గమనిస్తే సంస్థ సిగరెటేతర వ్యాపారం 17 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. 23,000 కోట్ల రూపాయల ఆదాయానికి చేరిందన్నారు. కాగా, ఐటిసి పెట్టుబడుల ఆలస్యానికి కారణం ప్రభుత్వం నుంచి ఆమోదం సకాలంలో రాకపోవడమేనన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఐటిసి ఆదాయం సిగరెట్ల అమ్మకాల ద్వారానే 8,230.60 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇది 7,733.43 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఈ క్రమంలో కొందరు భాగస్వాములు పొగాకు వ్యాపారం వృద్ధిని తగ్గించుకుని మిగతా వ్యాపారం వృద్ధిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పొగాకు పంటలు, దాని వాడకంపై ఉన్న ఆంక్షల నేపథ్యంలో పొగాకు ఆధారిత వ్యాపారంపై సంస్థ ఆధారపడకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై దేవేశ్వర్ స్పందిస్తూ.. పొగాకు వ్యాపారం వృద్ధిపథంలో కొనసాగుతోందని, అదికూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంస్థ వ్యాపారం నడుస్తోందని గుర్తుచేశారు. అలాంటి వ్యాపారాన్ని తగ్గించుకోవడం దేనికన్న అభిప్రాయం దేవేశ్వర్ నుంచి వ్యక్తమైంది. భవిష్యత్తులోనూ పొగాకు వ్యాపారం లాభదాయకమేనని స్పష్టం చేశారు. దేశీయ మార్కెట్‌లో సిగరెట్ల తయారీలో ఐటిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నది తెలిసిందే. ఇక ఎఫ్‌ఎమ్‌సిజి, హాస్పిటాలిటీ, పేపర్‌బోర్డ్, ప్యాకేజింగ్, ఐటి, వ్యవసాయ రంగాల వ్యాపారాలను నిర్వహిస్తున్న ఐటిసి.. 2030 నాటికి లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లుగా కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్లాలని దేవేశ్వర్ సూచించారు.
దేవేశ్వర్‌కు చివరి సమావేశం
69 ఏళ్ల దేవేశ్వర్.. ఐటిసి చైర్మన్, సిఇఒగా కొనసాగుతుండగా, ఇది ఆయనకు ఆఖరి ఎజిఎమ్. ఫిబ్రవరిలో ఆయన ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. 1968లో దేవేశ్వర్ ఐటిసిలోకి రాగా, 1996 జనవరిలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత రెండు దశాబ్దాలుగా ఐటిసికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇరవై ఏళ్లలో సంస్థ ఆదాయం 51,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. దేవేశ్వర్ ఐటిసి బాధ్యతలు చేపట్టే సమయంలో సంస్థ ఆదాయం 5,200 కోట్ల రూపాయలకు దిగువన, లాభం 452 కోట్ల రూపాయలుగానే ఉంది. దీంతో దేవేశ్వర్ రాకతో సంస్థ ఆదాయం పదింతలైంది.

కోల్‌కతాలో శుక్రవారం జరిగిన ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్)లో పాల్గొన్న సంస్థ బోర్డు సభ్యులు

ఐటిసి ఎజిఎమ్‌లో మాట్లాడుతున్న సంస్థ చైర్మన్ వైసి దేవేశ్వర్