S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరిత తెలగాణకోసం సమష్టి కృషి

తూప్రాన్, జూలై 22 : హరితహారం సాదించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మనోహరాబాద్ శివారులో గల ఐటిసి కన్సూమర్ గూడ్స్ తయారీ యూనిట్‌లో, ముప్పిరెడ్డిపల్లి శివారులో గల ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేది మొక్కలేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఅర్ తన జాతకం ప్రకారం గిట్టంగి మొక్కను నాటారు. అనంతరం విద్యార్థులను నాటిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెకరెట్రీ అరవింద్‌కుమార్, ఐటిసి ప్రతినిధులు చిత్తరంజన్‌దార్, సుదర్శన్, వర్తిక, జీడిమెట్ల పరిశ్రమల మండలి చైర్మెన్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురలీ యాదవ్, జనరల్ మేనేజర్ మాదవి, పిఎసిఎస్ చైర్మెన్ మహిపాల్‌రెడ్డి. జడ్పీటిసి సభ్యురాలు సుమన, నేతలు లక్ష్మీనర్సింలు, మల్లారెడ్డి, అనంత్‌రెడ్డి, మధుసూదన్‌డ్డి పాల్గొన్నారు.