S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

బి.వి.ఎస్.ప్రసాద్, bvcartoons@gmail.com
ఫేపర్లో ఒకరు నవ్యాంధ్ర అంటారు. స్వర్ణ ఆంధ్ర అని ఒకరు రాస్తారు. మరో సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏది సరైనది?
విశేషణాలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే చాలు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
హిందూ ఆలయాలను పడగొట్టడం, అంతా అయ్యాక భక్తుల మనోభావాలను దెబ్బ తీయకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి బాబు అనడం. ఇలా దేవాలయాలను పడగొట్టి ఓట్లు సంపాదించాలనా? కూల్చివేయబడ్డ 30 పైగా ఆలయాలలో ఆదిశంకరాచార్య, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల వంటి మహానుభావులు ప్రతిష్ఠ చేసినవి. రాష్ట్ర కేబినెట్‌లో బి.జె.పి. మంత్రులు కూడా ఈ దుశ్చర్యలు ఆపలేకపోవడం విడ్డూరం. రాజ్యమేలే వారే ఇలా ఔరంగజేబులవడం..?
మన దౌర్భాగ్యం.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
విజయవాడలోని ఆలయాలు సి.ఎం. మెప్పు కోసం, ఒక వర్గ నాయకమ్మన్యులు, వారి చెంచాలు, మహమ్మదీయుడైన కలెక్టరుగారు కూడా ధ్వంసం చేస్తూ (పుష్కరాల సాకుతో), చివరకు ఆశ్రమ పీఠాధిపతులు ‘రోడ్డు’పై పడటం.. చూస్తే మీకేమనిపిస్తోంది?
హిందువులంటే అలుసు.

అందుకనే ఆనాటి తలలు పండిన రాజనీతి కోవిదులు విజయవాడ రాజధాని పెడ్తే ఒక ‘వర్గ’ ఆధిపత్యం బలిసిపోతుందని, సామాన్యులు విలవిలలాడిపోతారని ఊహించారు. ఇది సత్యం కాదా?
నో కామెంట్.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
నేటి కార్పొరేట్ విద్యా విధానంతో త్వరలో మన మాతృభాష మృతభాష కాబోవుచున్నదా?
దానికి మనం చేయగలిగింది అంతా చేస్తున్నాం. ఆపైన భాష అదృష్టం.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పార్టీ మార్పిడి చట్టం ప్రకారం ఎంఎల్‌ఏలు, ఎం.పిలు వున్న పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరాలి కదా. మరి ఆంధ్రకు ఎందుకు వర్తించటం లేదు?
చట్టాన్ని చాప చుట్టటంలో మన వాళ్లు ఘనులు.

డొక్క వృషవాహనుడు, వక్కలంక
ఆదివారం అనుబంధం పుస్తకం పూర్వపు ఆకారంలోనే బాగుంటుంది. ఎవరు కోరారని ఈ మార్పు?
తప్పనిసరై.

ఎం.కనకదుర్గ, తెనాలి
జూన్ 26, ఆదివారం అనుబంధం సరికొత్త గెటప్‌లో వచ్చి మాకెంతో కనువిందు చేసింది. శీర్షికలకు కేటాయించిన పేజీలు చదవడానికి సులభంగా ఉన్నాయి. మరి కొన్ని శీర్షికలను అదనంగా ప్రారంభించేందుకు ఈ గెటప్ సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఇదే గెటప్‌ను భవిష్యత్తులో కొనసాగించవల్సిందిగా మా విన్నపం.
సంతోషం.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
ఈ మధ్య ఆంధ్రభూమిలో ప్రతి శనివారం వచ్చే ‘వీక్ పాయింట్’ కనిపించటం లేదు. ఎందుకు? పోనీ ‘ఉన్నమాట’ అయినా వారంవారం వస్తుందా అంటే అదీ లేదు. అటు ‘వీక్‌పాయింట్’ లేక, ఇటు ‘ఉన్నమాట’ లేక ‘్భమి’ని నమ్ముకున్న పాఠకులు ఏమైపోవాలి? ఈ రెండు శీర్షికలు భూమి పాఠకులకు ఎంతో ఇష్టమైన శీర్షికలు. దయచేసి ప్రతి వారం వచ్చే విధంగా చూడండి.
వీక్ పాయింట్ స్థానంలోనే ఉన్న మాట వచ్చింది. ఆరోగ్య సమస్య వల్ల, ఈ మధ్యన అదీ ఆగింది. సాధ్యమైనంత త్వరలో మళ్లీ కొనసాగించాలనే ఉంది.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
లంచాలు మరిగే ప్రభుత్వ ఆఫీసుల్లో, పోలీసుస్టేషన్లలో, స్కూళ్లల్లో సి.సి. కెమెరాలు పెడితే?
లంచాలు తగ్గవు.

చంద్రశేఖర్, వక్కలంక
‘రోమన్ హాలీడే’ (1953) అన్న ఆంగ్ల చిత్రం చూసి ఉంటారు. దానిని ‘చిరంజీవి - సమంత’లతో పూర్తి మసాలాలు కూరి మీ దర్శకత్వంలో నిర్మిద్దామని సంకల్పం. ఏమంటారు?
ముందు ప్రేక్షకులను వెతకండి.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
రోగులకు, వైద్యులకు మధ్య సుహృద్భావ బంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. డబ్బే ప్రధాన లక్ష్యంగా వైద్యులు పని చేస్తుండగా వారిపట్ల రోగులు అనుమానాస్పద వైఖరితో ఉంటున్నారు. ఇద్దరి మధ్య మానవతా బంధం నెలకొనడానికి నేటి వైద్యులు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని నా అభిప్రాయం. మీరేమంటారు?
పవిత్ర వైద్యవృత్తి ఈ రోజుల్లో పక్కా వ్యాపారమైంది. మాయామర్మాలు తెలియని రోగులకు వైద్యుడు చెప్పిందే వేదం. ఆ నమ్మకమే వెర్రితలలు వేస్తున్న వైద్య వ్యాపారానికి మూలధనం. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించటం సమస్యకు మూలం.

కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
గత ఆదివారం నుంచి మొత్తం అనుబంధం మార్చేశారు. ఇదివరకు పుస్తకం ఆకారంలో ఉండేది. అదే బాగుందనిపిస్తోంది. తెలంగాణాలో ఆంధ్ర పదం అంత ఇష్టంగా కనపడటం లేదు. ఆంధ్ర సారస్వత పరిషత్ పేరు తెలంగాణా సారస్వత పరిషత్ అనీ, కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని తెలుగు భాషా నిలయమని మార్చేశారు. కొన్నాళ్లయ్యాక మీరు కూడా ఆంధ్రభూమి అని కాకుండా తెలంగాణా భూమి అని మార్చుతారా? 50 సం.ల నుండి ఉన్న పేరును మార్చరనే ఆశిస్తున్నాను.
ఆ భయం లేదు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com