S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (జూలై 24 నుండి 30 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

లక్ష్య సాధనతో కార్యసాఫల్యం చేసుకుంటారు. ఆశించిన దానికంటె అధికంగా పొందనున్నారు. స్వీయ నియంత్రణతో కావలసిన హితులకు మార్గదర్శకత్వం వహిస్తారు. విద్య, ఉద్యోగ రంగాల వారు కృషి మేరకు ఫలితాలుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులున్నా ఆదాయం సర్దుబాటు ఉంటుంది. ఉన్న అవకాశాలను వినియోగించుకుంటారు. వస్తువుల ఖరీదు నందు అప్రమత్తత అవసరం. అన్నింటా చేపట్టే పనులందు మార్పులుంటాయి. సంతాన లాభం. మీ మాటలను వక్రీకరించే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ స్వల్పంగా లాభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలున్నా అనుకోని ఖర్చులుంటాయి. ఉత్సాహ ప్రోత్సాహాలు ఉన్నాయి. స్ర్తి మూలక లాభం. కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాహన ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. విదేశీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలత. రావలసిన బకాయిలు వసూలవుతాయి. విద్య, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక రంగాల వారు సంతృప్తిని పొందుతారు. పెద్దవారితో పరిచయాలు ఉపకరిస్తాయి. స్ర్తిలకు అన్నింటా పర్యవేక్షణ అవసరం. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మేలైన విధానాలతో కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాల పట్ల నియంత్రణ అవసరం. ధన గౌరవాలు అధికమవుతాయి. కళ, సాహితీ, సాంకేతిక, విద్య, వైద్య రంగాల వారు అనుకూల ఫలాలందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. మొహమాటానికి పోకండి. సమస్యలను పరిష్కరించుకొంటారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆహార నియంత్రణ అవసరం. పోటీ పరీక్షలందు విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు. వృత్తి, వ్యాపార, వైద్య రంగాల వారు కృషికి తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

కార్యాలు పూర్తి చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. వ్యయాలను నియంత్రించుకోవాలి. ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలందు సమస్యలున్నా పరిష్కరించబడతాయి. పొగడ్తలకు దూరంగా ఉండండి. తలచినది వేరే విధంగా ఉండనుంది. మీ ప్రమేయంతో ఇతరుల సమస్యలు తొలగిపోయే అవకాశాలున్నాయి. దంపతులు పనుల విషయంలో చర్చించి సానుకూలం చేసుకొంటారు. అప్రయత్న ధన లాభం. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కొత్త వొరవడికి అవకాశముంది. శుభకార్యాలు కలసి వస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

అవకాశాలను వినియోగించుకొంటారు. పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఫలవంతంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. పనులందు సంతృప్తి. ఆత్మీయతతో మెలగండి. విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు ఆశించిన ఫలితాలను వెంటనే పొందలేక పోవచ్చు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సలహా సంప్రదింపులకై ఆత్మీయులు మీ వద్దకు వస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలాలు పొందుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. స్వయంకృషితో మార్గదర్శకత్వం వహిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అనుకున్న పనులు అనుకున్న విధంగా కానందుకు ఆగ్రహం వ్యక్తం చేయకండి. బకాయి పడిన పనులు నేర్పుతో పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం. సాంఘిక కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఖరీదైన వస్తువులు, ఆభరణాలతో ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. రియల్ ఎస్టేట్, వ్యాపార, వృత్తి, సాంకేతిక రంగాల వారు అనుకున్నట్లుగా ఫలితాలను వెంటనే పొందలేకపోవచ్చు. సంతాన రీత్యా లాభాలు. ప్రలోభాలకు లోనవ్వకండి. స్ర్తిలు బంధువులతో కలిసి కుటుంబ కార్యక్రమాలలో తమదైన నేర్పును ప్రదర్శిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పరిశీలనాత్మక ధోరణితో కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. ఇతరులకు హామీలు ఉండకండి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. బదిలీలు, పదోన్నతులు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులకు పర్మినెంటు అవకాశాలున్నాయి. చేసే పనులందు దృష్టిని పెట్టండి. బ్యాంకు దగ్గర నగదు లావాదేవీలందు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పత్రాలు చేజారే అవకాశముంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అర్థవంతమైన సంభాషణలతో పలువురిని ఆకట్టుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆత్మశక్తితో పనులు పూర్తి చేస్తారు. అన్నింటా శుభప్రదం. ఆదాయ లావాదేవీలు ఊహించని మలుపులు తిరుగుతాయి. అప్పులు చేయకండి. ఇవ్వకండి. ప్రయాణాలు చేసే అవకాశముంది. ప్రమాదాల నివారణ దిశగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార, వాహన, కళ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండేట్లు నియంత్రించుకోండి. అనుకోకుండా పైకం అందే అవకాశముంది. ప్రతి పనిలోనూ తృప్తిని పొందుతారు. ఓర్పు అవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

పనులు పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా పనులు జరుగకపోయినా ఆలస్యంగానైనా మంచి ఫలితాలుంటాయి. పత్రిక, ఆధ్యాత్మిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల వారు అభివృద్ధిని పొందుతారు. సంతాన ప్రాప్తికి అనుకూలం. స్వయంతృప్తి అన్నింటా అవసరమని గుర్తిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆహార వ్యవహారాలందు నియంత్రణ పాటించండి. క్రమశిక్షణతో పనులు నేర్పుగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలున్నాయి. ఆదాయ లావాదేవీలు తృప్తినిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ప్రణాళిక మేరకు కార్యాలు పూర్తి చేస్తారు. ఇతరులు మీ పనులను చెడగొట్టే మార్గాలు అనే్వషిస్తున్నారు. జాగ్రత్త. ధైర్యం సడలనీయకండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులున్నా సంతృప్తిని పొందుతారు. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. మనశ్శాంతితో వ్యవహరించండి. వైద్య, విద్య, వృత్తి, వ్యవసాయ రంగాల వారు మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యవహార పర్యవసానాలు అనుకూలం.

కుంభం ( ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

పెండింగ్‌లో ఉన్న పనులు మెల్లగానైనా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కదలికలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి పురోగతి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. పెద్దల అండదండలతో అనుకున్నవి సాధిస్తారు. కొన్ని ప్రయాణాలు అవకాశముంటే వాయిదా వేసుకోవాలి. వస్తు, వస్త్ర ఖరీదులందు, ధారణ యందు అప్రమత్తత అవసరం. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. ఊహకందని సంతోషకరమైన వార్తలు వింటారు. సంతాన సౌఖ్యం. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయ లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, చేతివృత్తుల వారు, ఉద్యోగ రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మెల్లగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆహార విహారాలందు నియంత్రణ అవసరం. అనారోగ్యం దరికి రానీయకండి. వాహన, ప్రయాణ సౌఖ్యం. సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగులు మెరుగైన పని తీరు కనబరుస్తారు. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు ఉన్నాయి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855