S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక బిజీ బిజీయే..!

-అంటోంది తాజాగా అందాల భామ కాజల్ అగర్వాల్. అంటే టాలీవుడ్‌లో అనుకునేరు సుమా! కాదు..కోలీవుడ్‌లోనట. అదేంటి? అలా అంటుందేమిటి అనుకుంటున్నారా? నిజమే మరి.. కాజల్ చెప్పిన మాటలో ఎంతో నిజముంది. ప్రస్తుతం జీవా సరసన ‘క వలైవేండామ్’తో పాటు విక్రమ్ జంటగా ‘గరుడా’ ఇవే గాక, అజిత్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ వచ్చిందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. టాలీవుడ్‌లో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ ఇక్కడ కూడా త్వరలోనే బిజీ అవుతానంటోందిట. తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పూర్తయితే ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశగా కూడా ఎదురుచూస్తోందిట. ‘‘ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నో చిత్రాలు మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన నాకు మళ్లీ రెండు భాషల్లో మంచి అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటికి సరైన న్యాయం చేస్తా. దాంతో మళ్లీ తప్పకుండా బిజీగా మారుతా’’నంటోంది కాజల్. సో..మంచిదే కదా! అయితే కెరీర్ మళ్లీ గాడిలో పడుతున్నట్లే! ఏమంటారు?!