S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆమే రోల్ మోడల్!

అందాల భామ, సెనే్సషనల్ బ్యూటీ నయనతార ఇటు తెలుగు.. అటు తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేసి రెండు చోట్లా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది. ‘‘టాలీవుడ్‌లో బిజీగా అగ్రహీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పుడే బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే వాటికి ఏ మాత్రం ఆశపడకుండా వద్దనుకుంది. ఏ నటి అయినా ఇలాంటి అరుదైన అవకాశం వదులుకుంటుందా? నటి నయనతార మాత్రం వాటిని నో చెప్పేసింది అందుకే నా ఆమే నా రోల్ మోడల్’’అంటూ కితాబిచ్చింది యువతరం బ్యూటీ కీర్తి సురేష్. ‘నేను శైలజ’ చిత్రంలో అందరికీ పరిచయం అయిన ఈ భామ నటి మేనక వారసురాలన్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా పరిచయం మాత్రం తమిళంతోనే అయింది. ‘రజని మురుగన్’ తొలి చిత్రమే..కానీ విడుదలైంది మాత్రం ‘ఎన్నమాయం’ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. ‘రజని మురుగన్’ సక్సెస్ సాధించడంతో తమిళంలో అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ధనుష్‌తో ‘తొడరి’తోపాటు మరో అవకాశం విజయ్‌తో జోడీ కట్టింది. ఇలా మంచి రేంజ్‌కు దూసుకెళుతున్న కీర్తికి రోల్ మోడల్ నయనతారే కావడం విశేషమే మరి!

-సమీర్