S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్ని చిన్ని ఆశ!

చిన్ని చిన్ని ఆశ...అని అనుకుంటాం కానీ అందాలతార హన్సికకు టాలీవుడ్‌పై బోలెడన్ని పెద్ద పెద్ద ఆశలే వున్నాయి. ఎన్నో ఆశలు..మరెన్నో కోరికలతో తెలుగు చిత్రసీమకు ‘దేశముదురు’తో పరిచయం అయిన ఈ భామకు అటు తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా టాలీవుడ్‌లో చుక్కెదురైంది. బాలనటిగా పేరుతెచ్చుకున్న హన్సిక కథానాయికగా తెరంగేట్రం చేసినప్పుడు బాగానే నిలదొక్కుకుంటుందని అంతా భావించారు. టాలీవుడ్డే గురిగా భావించిన హన్సికకు ఇక్కడ అడుగడుగునా పరాజయం తప్పలేదు. ఎంపిక చేసుకున్న చిత్రాలు... వచ్చిన బ్యానర్లు ఆమెకు కెరీర్‌ను ఏ మాత్రం అందించలేకపోయాయి. తెలుగులో అడపాదడపా నటిస్తుండగానే తమిళ చిత్రాల్లో అవకాశాలు రావడంతో అటువైపు తొంగిచూసింది హన్సిక. ఒకటెనుక ఒకటి..వరుసగా భలే ఛాన్సులు రావడంతో ఇక తనది కోలీవుడ్డే అనుకుంది. బాగా బిజీ అయిపోయింది. ఒక దశలో హన్సిక కాల్షీట్లు దొరకడం అంతా సులభం కాలేదు. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమిళనాట వెలుగులు విరజిమ్ముతూనే వుంది. అయినా..ఎదో చిన్ని చిన్ని ఆశ ఆమె మనసును తొలుస్తూనే వుంది. అదే టాలీవుడ్..! టాలీవుడ్‌లో పేరుతెచ్చుకుంటే ఎంత పాపులారిటీ వస్తుందో ఆమెకు తెలియంది. కాదు. ఎట్టకేలకు అలాంటి అవకాశాన్ని రెండేళ్ల విరామం తర్వాత తెలుగులో మళ్లీ సంపాదించుకుంది. ఆమె టాలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం ‘పవర్’. ఇప్పుడు తాజాగా గోపీచంద్‌తో జోడీ కట్టబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. మళ్లీ టాలీవుడ్‌లో మెరవబోతున్న హన్సిక ఇకనైనా ఇక్కడ నిలదొక్కుకుంటుందో లేదో చూడాల్సిందే మరి!!

-సమీర్