S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కస్సుమంటోంది...!

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్‌ని ఎవరైనా కదిలిస్తే కస్సుమంటోందిట..! కారణాలు ఏవైనా..కలిసిచోటల్లా ఆమెను మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటే ‘కస్సు’మనకుండా మరేం అంటోంది చెప్పండి? బాలీవుడ్ తారలు ఎప్పుడూ వార్తల్లో వుండడం మామూలే. ముఖ్యంగా అగ్రతారలైతే మరీనూ...! తనపై వచ్చే రూమర్స్‌కు ఎంతో విసిగి వేసారిన ఈ భామ తాజాగా ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి మరో సంచలనానికి తెరలేపింది. ఈ విధంగా అభిమానులకూ మరింత దగ్గరయింది. ఫేస్‌బుక్‌లో దాదాపు నలభై లక్షల వరకు లైక్‌లు ఆమెను చిత్తుచేశాయి. అభిమానుల్లో తనకు ఇంతటి ఆదరణ చూసి ఆమె నివ్వెరపోయింది. అంతేకాదు, గుగూల్‌లో గత పదేళ్ల కాలంలో నెటిజన్లు ఎక్కువగా వెతికిన భారతీయురాలు కూడా కత్రీనాయే కావడం ఆమె అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇంతటి పాపులారిటీ వున్న తనపై మీడియా రకరకాల రూమర్స్‌తో ప్రశ్నల వర్షం గుప్పించడం ఎంత వరకు సబబు అని కూడా కత్రీనా ఎదురు ప్రశ్నిస్తోందిట! మరి..కత్రీనా..మజాకా!!

-సమీర్