S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరిత ప్రతినిధి

వనం కోసం మనమై...
కోటి గొంతుకల నినాదమై...
అంకురార్పణ చేసి..
పిడికిలెత్తి జైకొట్టి...
దోసిలిలో మొక్కనిలిపి...
తెలుగు రాష్ట్రాల కల్పవల్లి...
తెలంగాణ తెలుగు తల్లి మెడలో
పచ్చల హారమై మెరసి...
హరిత హారతినిచ్చి...
రేపటి తరాల వెలుగు పూల వనమై...
సంజీవనమై...
కదులుదాము కదులుదాము
జనులంతా ఏకమై...
ఒకరికొకరు చేయికలిపి
కంకణబద్దులమై...
మొక్కవోని దీక్షతో...
వృక్షో రక్షతి రక్షితః
మంత్రోపదేశమై...
మనసున ప్రతినబూని...
ప్రతి ఒక్కరూ మొక్క నాటి
ప్రకృతి ప్రేమికుడిగా మారి
శాంతినికేతనమై..
సందేశాత్మకమై...
ఒక్కరు ముగ్గురుగా...
మరో ముగ్గురూగా...
భారతావని జీవకోటికి...
నిరంతర ప్రాణవాయువు నందించే
దీపస్తంభాలుగా...
అమృత ఫలాలనిచ్చి...
ఆకలి తీర్చే అమ్మతనమై...
ఎండ్లల్లో అలసిన జీవజాలానికి
నీడనిచ్చే నేస్తాలుగా...
ఆయుర్వేదమై ధన్వంతరియై...
భరతమాత సిగలో...
తెలుగు రాష్ట్రాల...
హరిత పతాకాలను
రెపరెపలాడించి...
వర్షాలను స్వాగతించి...
పర్యావరణ పరిరక్షణకు
ప్రతీకగా నిలిచి...
నిలువెత్తు సాక్ష్యాలై...
హరిత ప్రతినిధులుగా..

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655