S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (జూలై 31 నుండి ఆగస్టు 6 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అభివృద్ధి బాటలో కార్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన సౌఖ్యం. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలందు అనుకూలత. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. శత్రు మూలక సంతోషం. దంపతుల మధ్య అవగాహన. ఉన్నత అధికారులు, పెద్దలను కలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్నది లక్ష్య సాధనతో నెరవేర్చుకుంటారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు. వ్యాపార, వివిధ ప్రజోపయోగ రంగాల వారు వృద్ధి బాటలో పయనిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తి నిస్తాయి. కుటుంబ సౌఖ్యం. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలందు ఉత్సాహంతో పాల్గొంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రయాణ సౌఖ్యం. స్ర్తిలు హుషారుగా ఉంటారు. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల వారు అపారంగా కాకపోయినా అనుకున్నది సాధిస్తారు. ఆందోళనలు వద్దు. ముఖ్యమైన వార్తలు ఆనందాన్నిస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కార్యాలు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధు మిత్రులు సమయానికి సహకరిస్తారు. శత్రు భయం. ఓర్వలేని వారున్నారని గమనించండి. అనవసరంగా మీ స్వ విషయాలు ఇతరులకు తెలుపకండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్ర్తి మూలక సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు కొత్త పథకాలు ప్రారంభించి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ పొదుపు పథకాలు పెట్టుబడికి అనుకూలం. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. మందకొడిగా ఉండకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆదాయ వృద్ధి. ఖర్చులు నియంత్రించుకోవాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం తృప్తికరం. భూ సంబంధ వ్యవహారాలు పరిశీలనతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఓర్వలేని వారు మీకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్‌లు, స్థల మార్పిడులుంటాయి. విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని పోటీ పరీక్షలు రాయండి. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలం. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనే శక్తికై అనే్వషించండి. దంపతులు సంతోషకరమైన వార్తలు వింటారు. నదీ స్నానాలు చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
తరచూ మార్పులు చేర్పులతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు, కుటుంబ యజమానికి స్థాన చలనముంటుంది. అకారణ విరోధాలకు అవకాశముంది. ఓర్పు నేర్పులతో కొన్ని సమస్యలను పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగ రంగాల వారికి అనుకోని ఇబ్బందులు ఎదురయినప్పటికీ అంతిమ జయాన్ని పొందుతారు. దంపతులు కోపతాపాలకు దూరంగా ఉండండి. నిరుత్సాహంగా ఉండకండి. స్పెక్యులేషన్ వాయిదా వేసుకోవాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
చేపట్టిన కార్యాలందు విజయం. ధన లాభమున్నా ఖర్చులు ఊపందుకుంటాయి. నూతన వ్యవహారాలు కలసి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతలు ఉంటాయి. వ్యాపార, వృత్తి రంగాల వారు అనవసర స్టాక్స్ పెట్టుకోవద్దు. ఇబ్బంది పడవద్దు. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. వాహన చోదకులు స్పీడును నియంత్రించుకోవాలి. దంపతులు ఆరోగ్య సంబంధిత నియమాలు పాటించాలి. సమస్యలు తొలగి ఆనందిస్తారు. ఇతరులకు హామీలు వద్దు. ఇతరులకు మాట సాయంతో మీ విలువ అధికమవుతుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
వృద్ధిని సాధిస్తారు. ఆదాయం అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. భార్యాభర్తల మధ్య అవగాహనతో ఆనందాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి, విద్య, వ్యాపార రంగాల వారు అనుకున్నది మెల్లగానైనా సాధిస్తారు. ఓపికతో, సహనంతో లబ్ధిని పొందుతారు. నూతన పరిచయాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నింటా వృద్ధి. ఆధ్యాత్మిక కార్యాలందు జయం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
కార్యాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఫరవాలేదు. ఖర్చులు ఉపయుక్తంగా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల సాయం అవసరపడుతుంది. సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం. సంఘంలో ఉన్నత స్థితి. పరిస్థితులు అనుకూలంగా మలచుకోవాలి. వృత్తి, వ్యాపార, వైద్య, అభినందన, ఈవెంట్ ఆర్గనైజర్లు లాభాలు పొందుతారు. కొత్త బ్రాంచీలు తెరచే అవకాశాలున్నాయి. ప్రయాణ సౌఖ్యం. మతిమరపు దగ్గరకు రానీయకండి. పుణ్యనదీ దర్శనం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు అనుకూల సమయం. ఆదాయం ఫరవాలేదు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆలస్యంగా పనులు జరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెంపొందించుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి అనుకూలం. విద్యార్థులు అనుకున్న రంగాల్లో ప్రవేశిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశముంది. నమ్రతతో పనుల పూర్తికి అవకాశం. దంపతులు నమ్మకంతో పనులు పూర్తి చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
తక్కువ సమయంలో చేసిన పనులు మరలా చేయాల్సి వస్తుంది. తద్వారా ఇబ్బందులకు అవకాశముంది. తీర్థయాత్రలు, నదీ స్నానాలందు పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇబ్బందులున్నా మీ తెలివితేటలతో తొలగించుకుంటారు. విద్యార్థులు వ్యాసంగాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, కిరాణా, బ్యూటీ పార్లర్, చేతి వృత్తుల వారు అనుకోని లాభాల నందుకుంటారు. స్పెక్యులేషన్ స్వల్పంగా లాభిస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆర్థిక లావాదేవీలందు సంతృప్తి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. మిత్రులకైనా ఇబ్బంది పడుతూ పైకాన్ని ఇవ్వవద్దు. ప్రయాణాలందు అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం ఫరవాలేదు. వాహన రిపేర్లు చేయించాల్సి వస్తుంది. వాహన సౌఖ్యం. ఆస్తి తగాదాలందు నేర్పు అవసరం. కోర్టు వ్యవహారాలందు పరిష్కార సూచనలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలందు, ప్రయత్నాలందు ఆటంకాలున్నా ఇతరుల సాయంతో తొలగిపోతాయి. విద్య, వ్యాపార, వృత్తి రంగాల వారు అనుకున్న లాభాలు పొందుతారు. దంపతులు ఆధ్యాత్మిక కార్యాలందు పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాలందు ఆశించినంత ప్రగతి వెంటనే కనిపించదు. ఆలోచించి కార్యనిర్వహణలో ముందడుగు వేయాలి. నూతన పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. శత్రువులు మిత్రులవుతారు. సహాయాన్ని అందిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855