రోబో స్పైడర్!
Published Saturday, 6 August 2016ఫ్రాన్స్‌లోని నాంటెస్ రోడ్లపైకి ఉన్నట్లుండి ఓ భారీ సాలీడు దూసుకువచ్చింది. ఎనిమిది కాళ్లతో భయంకరమైన రూపంతో అది నడుస్తూ వస్తూంటే మొదట జనం భయపడ్డారు. తరువాత అది రోబో స్పైడర్ అని అర్థమయ్యాక దానిముందు నిల్చుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కలప, ఉక్కుతో లెస్మెషిన్స్ నెల్లి అనే పరిశ్రమ యాజమాన్యం దీనిని రూపొందించింది. దీని బరువు 38 టన్నులు.