S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు నగరంలో యుపిపిఎస్‌సి పరీక్ష

విజయవాడ, ఆగస్టు 6: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు -2016 విజయవాడ నగరంలోని 28 కేంద్రాల ద్వారా 14,647 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరాలని ప్రత్యేక పరిస్థితులలో 10 నిమిషాల వరకు సమయం ఇవ్వటం ద్వారా ఆయా కేంద్రాల నిర్వాహకులకు అధికారాలు ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం యుపిపిఎస్‌సి-2016 పరీక్షల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే పరీక్షలకు మొదటి పేపరు ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు, రెండవ పేపరు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలకు అంధవికలాంగత్వం, ఎల్‌డిసిపి గల 89 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వారికి శ్రీ కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, పటమటలంక, విజయవాడ (ఐడి నెం62026) కేటాయించటం జరిగిందన్నారు. సమావేశంలో పరీక్షల తనిఖీ అధికారి భూపేంద్ర సింగ్, సబ్-కలెక్టర్ జి.సృజన, డిఆర్‌ఓ సిహెచ్ రంగయ్య, కేంద్ర పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.