S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (ఆగస్టు 14 నుండి 20 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆరోగ్యం తృప్తికరం. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, మార్పులుంటాయి. అదనపు ఆదాయానికై ప్రయత్నించకండి. శ్రమాధిక్యతతో గుర్తింపును పొందుతారు. తగు జాగ్రత్తలు అవసరాలను గుర్తు చేసాతయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. స్వతంత్ర భావనలను స్వాగతించండి. దంపతులకు మేలైన కాలం. స్ర్తిలు అనుకున్నవి పొందుతారు. పోటీ తత్వంలో మీదే పైచేయి. పెట్టుబడులు అనుకూలం. ఎవరినీ అతిగా నమ్మకండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

కార్యాలు పూర్తి చేస్తారు. వివాదాలు సర్దుకుపోతాయి. ధనాదాయం, ఖర్చు నియంత్రణతో లబ్ధిని పొందుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు ఉపకరిస్తాయి. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించకండి. పెద్దల ఆశీస్సులు, సహకారాలు ఉపయోగపడతాయి. ఉద్యోగులు స్వతంత్రంగా ఆలోచించి మీదైన పద్ధతిలో ప్రమోషన్లు, బదిలీలు పొందుతారు. ఆరోగ్యం తృప్తికరం. సంపద విలువ పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. లాభదాయకమైన తరుణం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయ వ్యయాలందు సంతృప్తి. స్వీయ నియంత్రణతో దూరమైన పనులు దగ్గరై పూర్తవుతాయి. ఆశయాలు నెరవేర్చుకుంటారు. కాలం సంతోషంగా గడుస్తుంది. ఆదరణలు పొందుతారు. వ్యాపారంలో ధన లాభం. విద్య, ఉద్యోగ, వృత్తి, ప్రయాణ రంగాల వారికి మెరుగైన ఫలితాలు. బుద్ధి కుశలతతో ఆదరణ పొందుతారు. ధైర్యస్థైర్యాలతో అన్నింటా విజయాలు అందుకుంటారు. స్ర్తిల సలహాలతో అభివృద్ధి పొందుతారు. కోపతాపాలకు అవకాశమివ్వవద్దు. కుతంత్రాలను స్వతంత్రాలతో ఛేదిస్తారు. స్పెక్యులేషన్ లాభదాయకం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అభీష్ట సిద్ధితో కార్యాలు పూర్తి చేసుకుంటారు. శ్రమాధిక్యతతో సంఘంలో ఖ్యాతినందుకుంటారు. దంపతులు సంయమనంతో మెలగాలి. అనవసర ఆరాటాలు, పోరాటాలు వద్దు. ఆలోచనా ధోరణి అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మెరుగుపడతాయి. మీరు చేసిన సహాయం మరుగునపడే అవకాశాలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్ తృప్తికరం. అనుకోని ధనం అందుతుంది. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక లాభం తక్కువగా వున్నా ఖర్చుల నియంత్రణతో తృప్తిని పొందుతారు. మిత్రుల ఆలోచనలకు మీ స్వతంత్ర ఆలోచనలు జోడించి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు తప్పనిసరిగా సహాయం చేయవలసి వస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల రాక ఉపకరిస్తుంది. ఆలోచనలు రకరకాలుగా వున్నా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నింటా పర్యవేక్షణ అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అభీష్ట సిద్ధితోనే కార్యసిద్ధి. అన్నింటా ఆనందాన్ని పొంది, హితులతో పంచుకుంటారు. కాలానుగుణంగా సాలోచనలతో పనులు పూర్తి చేస్తారు. మీ సలహాలతో ఇతరులు లాభపడతారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ, సాంకేతిక, పత్రికా రంగాల వారు మెరుగైన ఫలితాలందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. విందు, వినోదాలందు మిత్రులతో పాల్గొని అనవసరంగా ఇతరుల పనులను మీద వేసుకోవటం వల్ల మాటలు పడవలసి వస్తుంది. సంకల్ప సిద్ధి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దూర ప్రయాణాదులు వాయిదా వేయడం మంచిది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక లావాదేవీలు ఉపయోగపడతాయి. ఇతరులకు జామీనులు ఉండకండి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. అనుకోని ధనం పొందేందుకు అవకాశముంది. ఒక విషయం మీకు అనుకూలంగా ఉండి, ఇతరులు మీతోపాటు ఆనందాన్ని పంచుకుంటారు. గుర్తింపు పొందుతారు. శుభకార్యాలందు బంధుమిత్రులతో పాల్గొంటారు. విద్యార్థులు సరైన ప్రణాళికలతో ఉత్తమ ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలసి వస్తాయి. అంతా మన మంచికేనంటూ సాగిపోండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్న పనులు కాకుండా వేరే పనులు చేయాల్సి వస్తుంది. ఏది కావాలో అదే మంచిగా అవుతుందనుకోండి. మనసులో వున్నది ఉబుసుపోక ఇతరులకు చెప్పకండి. మంచి వార్తలు సంతోషాన్నిస్తాయి. పెద్దల, నాయకుల పరిచయాలు, బంధుత్వాలు ఉపకరిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తినిస్తాయి. అనుకోకుండా ఇతరులకు పైకం ఇవ్వవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల పనులను ఇష్టం లేకుండా చేయవద్దు. మీ హద్దుల్లో ఉండటం ముద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

అనుకున్న పంథాలో కార్యసిద్ధి ఉంటుంది. మొహమాటం ఎప్పుడూ మంచిది కాదని గ్రహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయనున్నారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో, ఐక్యతతో పనులు పూర్తి చేయండి. అదృష్టం కలసి వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు యధావిధిగా ఉంటాయి. నూతన ఏజెన్సీలు కలసి వస్తాయి. భాగస్వామ్యంలో ఆలోచనా నిర్ణయాలు శ్రేయస్కరం. స్పెక్యులేషన్ తృప్తికరం. అనుకోకుండా పైకం అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆదాయ వ్యయాలందు నియంత్రణ అవసరం. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమస్యలు అధిగమిస్తారు. లక్ష్యాలను పట్టుదలతో చేరుకుంటారు. ఇతరులను అతిగా నమ్మకండి. ఉద్యోగ, వ్యాపార, వృత్తులందు అశ్రద్ధ వద్దు. స్పష్టమైన ఆలోచనలతో పని చేయండి. అలసత్వం మంచిది కాదని గ్రహిస్తారు. శుభకార్యాలు కలసి వస్తాయి. బంధుమిత్రులతో ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలందు జాగ్రత్త. స్ర్తిలు ఇంటికై ఖర్చు చేస్తారు. మంచి మార్పును కుటుంబంలో చూస్తారు. స్పెక్యులేషన్ ఫర్వాలేదనిపిస్తుంది. ఆస్తి వృద్ధి అయ్యే అవకాశముంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అలసత్వంతో ఏ పనీ చేయకూడదని గ్రహిస్తారు. సత్వర విజయాలున్నాయి. అనుకోకుండా పైకం అందే అవకాశం అబ్బురపరుస్తుంది. అయిన వారికి అనుకోకుండా ఖర్చు చేయాల్సి వస్తుంది. బంధువులతో సంబంధాలు, పెద్దల ఆశీస్సులు, సహాయం ఉపకరిస్తుంది. భాగస్వామ్య చర్చలందు అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచనలకు పదును పెట్టండి. కుటుంబంలో అనుకోని ఖర్చులున్నాయి. ఆరోగ్యం తృప్తికరం. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. భాగస్వామితో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. ముఖ్యమైన, పెండింగ్ వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు మెల్లగా లాభాల బాటను పడతారు. ఉద్యోగులు మెరుగైన ఫలితాలతో అధికారులను ఆశ్చర్యపరుస్తారు. కొంతమందికి ప్రమోషన్లు, బదిలీలు ఉన్నాయి. వాహన ప్రయాణాలందు వేగ నియంత్రణ అవసరం. వైవిధ్యమైన పనులు చేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సలహా సంప్రదింపులతో అంతా లాభాన్ని పంచుకుంటారు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855