S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోల్డెన్ ఛాన్స్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న భామల సంఖ్య మెల్లమెల్లగా ఊపందుకుంటోందిప్పుడు. ‘స్పై’తో హాలీవుడ్‌లోకి తొంగిచూసిన నర్గీస్ ఫక్రికి ఆ చిత్రం నటిగా మంచి పేరునే తెచ్చిపెట్టింది. అదే ఊపుతో తాజాగా మరో హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయింది. అదే ‘5 వెడ్డింగ్స్’. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం బాలీవుడ్ వివాహంపై ఓ పుస్తకం రాయడానికి వచ్చిన ఓ అమెరికన్ రచయిత్రి కథతో సాగుతుంది. ‘‘ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా వుంది. ఓ పక్క బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క వచ్చిన హాలీవుడ్ అవకాశాలను కూడా చేజార్చుకోకుండా ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నాను. నిజంగా ఇది నా అదృష్టంగానే భావిస్తున్నా. ఈ చిత్రానికి రూపొందిస్తున్న నమ్రతాసింగ్ గుజ్రాల్ ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దనున్నారు. ఆస్కార్ నామినీ కాండీక్లార్క్, గోల్డెన్ గ్లోబ్ నామినీ బోడోర్క్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇది నేను సద్వినియోగం చేసుకుంటాను’’అంటూ చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రి. నిజంగా నర్గీస్ ఫక్రికి ఇది గోల్డెన్ ఛానే్స..! ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తే నర్గీస్ ఎక్కడికో వెళ్లిపోతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అదీ..విషయం!!

-సమీర్