S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెరుపుతీగ!

చేసినవి తక్కువ చిత్రాలే అయినా..అగ్రతారే! అదెలా అనుకుంటున్నారా? తెరపై రూ.300 కోట్ల వసూళ్లు కురిపించడం అంటే మాటలా మరి! ‘రబ్ నే బనాదో జోడీ’తో బాలీవుడ్‌కు పరిచయం అయిన అందాలభామ అనుష్కశర్మ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో యమక్రేజీ. తాజాగా వచ్చిన ‘పీకే’, ‘సుల్తాన్’తో ఉన్నతస్థాయిలో ఎంతోగుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. అడుగుపెట్టిన నాటి నుంచి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ తన ఖాతాలో భారీ విజయాలను వేసుకుంది. ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘ఎన్‌హెచ్ 10’చిత్రాలూ ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చినవే. బాక్సాఫీస్ భామగా గుర్తింపుకు ఎలా ఫీలవుతున్నారని అనుష్కను అడిగితే- ‘‘ అలా అని నేనేమీ అనుకోవడం లేదు. నేను చేసిన చిత్రాల సంఖ్య తక్కువే కావొచ్చు. కానీ నటించిన ప్రతి చిత్రంలోనూ నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. ఇంత వరకు ముగ్గురు ఖాన్‌లతో నటించడం..అందులో రెండు చిత్రాలు రూ.300 కోట్లు దాటి వసూలు చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ‘పీకే’, ‘సుల్తాన్’్భరీ వసూళ్లు రాబట్టుకోవడంలో అమీర్, సల్మాన్ స్టార్ ఇమేజ్ కారణం కావొచ్చు కానీ. వాటిలో కథ, దానిని నడిపించిన దర్శకుడి ప్రతిభ వుంది. అందుకే ఆయా చిత్రాలు అంతటి రేంజ్‌లో దూసుకెళ్లాయి’’అంటూ చెప్పుకొచ్చింది అనుష్కశర్మ!!

-సమీర్