వౌన సముద్రం
Published Saturday, 3 September 2016వౌన సముద్రాన్ని నేను
పెను తుపానులే నాపై
కరవాలం ఎత్తి
సవారీ చేస్తూ
సుడిగుండాలను పంపించి
నా గుండెల్లో గునపాలను
నిర్దాక్షిణ్యంగా గుచ్చుతున్నా
వౌనం వహిస్తూ
చిరుమందహాసమే
చేస్తున్నా
మానవులు చేసే
మారణహోమాల్ని సైతం
సహనంతో భరిస్తున్నా
వైమానిక బీభత్సాలన్నీ
నా భూగర్భంలోనే నిక్షిప్తం
నాకు వయసుతో
నిమిత్తం లేదు
ప్రపంచ పుట్టుక
నా పుట్టుక ఒక్కటే
నా వౌనాన్ని
అసమర్థతగా చూడకండి.
*