ఇక బాలీవుడ్డే గతి!
Published Sunday, 4 September 2016టాలీవుడ్లో ఒక దశలో మంచి క్రేజ్ మీదున్న గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ఇక్కడ ఆశలన్నీ వదులుకున్నట్లే వుంది. తెలుగు చిత్రసీమలో కొత్త తారల రంగప్రవేశంతో ఇలాంటి సీనియర్ భామలు చాలామంది ఇలాంటి ఆశలే వదులుకున్నారు. అవకాశాలు లేక ఒకవైపు.. సీనియర్ కథానాయికలపై వున్న అశ్రద్ధ మరోవైపు వీరి పాలిట శాపమైంది. తాజాగా బాలీవుడ్లో నటించిన రెండు చిత్రాలూ ఇలియానాకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక అక్కడే మరిన్ని అవకాశాలను సాధించి బాగానే స్థిరపడిపోవాలనుకుంటోందిట. ఈ విష యం గురించి ఇలియాను చెబుతూ- ‘‘టాలీవుడ్, బాలీవుడ్ అంటూ వేరు చేయొద్దు. నాకు రెండూ ముఖ్యమే. నన్ను బాగా ఆదరించిన టాలీవుడ్‌ను నేను ఎన్నటికీ వదలిపోలేను. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో నాకు మంచి రోజులే వస్తున్నాయి. నేను నటిస్తున్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. అందుకే అక్కడా ఎక్కువ దృష్టి సారించాను’’అంది. నిజమే..ఎక్కడ అవకాశాలుంటే అక్కడే కెరీర్. ఏమంటారు?!