S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జోరుగా..హుషారుగా..!!

శత్రఘ్నసిన్హా తనయగా తెరపై అడుగులు పెట్టినా..ఆ తర్వాత నటిగా తానేంటో నిరూపించుకుంటూ బాలీవుడ్‌నే తన వైపునకు తిప్పుకునేలా చేసుకుంది అందాలభామ సోనాక్షి సిన్హా. చేస్తున్న చిత్రాలు.. ఆయా చిత్రాల్లో సోనాక్షి పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులనే కాదు, బాలీవుడ్‌కి చెందిన ప్రతీ ఒక్కర్నీ ఆలోచింపజేస్తున్నాయి. అందచందాలతో యువతరం హృదయాలను దోచుకున్న ఈ భామ ప్రస్తుతం జోరుగా..హుషారుగా చిత్రాల సంఖ్యను పెంచుకుంటూ సాటి నటీమణులకు ఓ సవాల్ విసురుతోందిట. అగ్ర హీరోయిన్‌గా తన స్టామినాను ఏ మాత్రం కోల్పోకుండా చేసుకోవడంలో సోనాక్షిని మించిన తార మరొకరు లేరని బాలీవుడ్ అంతా కోడైకూస్తోంది. కెరీర్ ఎలా సాగుతోంది అని సోనాక్షిని అడిగితే- ‘‘ ఎంతో హుషారుగా అనిపిస్తోంది. మంచి అవకాశాలు..అంతకంటే మంచి బ్యానర్లు..అపూర్వ ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తుంది. చక్కటి పాత్రల్లో నటించే అవకాశం లభిస్తోంది. వాటిని సమర్ధవంతంగా పోషించేందుకే నేను కృషి చేస్తున్నా. అగ్ర హీరోల చిత్రాల్లో చేసే అవకాశాలు నాకు మెండుగా రావడం నా అదృష్టంగానే భావిస్తున్నా. నాపై బాలీవుడ్ కురిపిస్తున్న ఈ ప్రేమను పదికాలాలపాటు పదిలంగా పదిలపరచుకోవాలన్నదే నా తపన. అంతే కానీ..ఏదో సాధించాలి..మరేదో అయిపోవాలి అన్న అత్యాశలేవీ నాకు లేవు. వుండవుకూడా’’అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. వాహ్..రియల్లీ గ్రేట్ బ్యూటీ!!