S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మ విశ్వాసంతో ముందుకు...!

తెలుగు, తమిళ, హిందీ ఇలా మూడు భాషల్లో దశాబ్దకాలంగా వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూ అగ్ర కథానాయకులతో జోడీ కట్టి ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్న అందాల భామ కాజల్ అగర్వాల్. అందానికి తోడు ఆత్మవిశ్వాసం కాజల్‌లో మెండుగా వుండడం వల్లే మంచి మంచి అవకాశాలు.. అంతకటే మంచి బ్యానర్లు ఆమెను వరించాయి. ఆత్మవిశ్వాసమే కెరీర్‌లో ఆమెను ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది. తాజాగా ‘ఖైదీ నంబర్‌వన్ 150’లో మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టింది. ఇది కాజల్‌కు లభించిన గొప్ప అవకాశంగా చిత్రసీమ చెప్పుకుంటోంది. కెరీర్ ఎలా వుంది? అని కాజల్‌ను మీడియా కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలు చేశాను. అలాగే బాలీవుడ్‌లో కూడా నేనేమిటో నిరూపించుకోవాలన్నదే తపన. ఆ దిశగా నా ప్రయాణం సాగుతూనే వుంది. మంచి బ్యానర్లు..మంచి దర్శకులతో చేసే అవకాశం లభిస్తోంది. నేను ఎంచుకున్న నా చిత్రాల్లో నా పాత్రలు అందరికీ నచ్చాయి. అలా అందరూ మెచ్చగలిగే పాత్రలు చేశాను కాబట్టే నా కెరీర్ ఇప్పుడు ఇలా సాగుతోంది’’ అని చెబుతూనే మరో విషయాన్ని కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. అదే..ప్రేమా, పెళ్లి విషయం. ‘‘ప్రేమా, పెళ్లి విషయంలో నాకు ఎలాంటి పట్టింపులు లేవు. నా అందానే్న కాదు నా భావాలను కూడా ప్రేమించగలిగేవాడు..నా మీద సంపూర్ణ విశ్వాసం వున్న వాడు. నాకు వరుడుగా రావాలి. అలాంటి వాడే నాకు సరిజోడు అన్న నా భావన. నేనెంతో కష్టపడి పనిచేస్తా. ఫలితం పట్టించుకోను. కథల ఎంపికలో నా మనసు చెప్పిందే వింటా. నా పాత్రను.. నేను చేసిన సినిమాలో నా నటనను ఎప్పుడూ విశే్లషించుకోను’’ అంది వివరంగా. ఇవన్నీ వింటే వాహ్..కాజల్ అనకుండా వుండలేం కదా!?

-సమీర్