S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బస్..బిపాసా ‘బస్’!

ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న నటి బిపాసాబసు ఇప్పుడు హాయిగా కబుర్లు చెబుతోంది. కలిసిన చోటల్లా ఎవ్వరికి పడితే వారికి తన నటనానుభవాలను పూసగుచ్చినట్లు వివరిస్తుందట. కొందరైతే బిపాసాను చూసి వామ్మో..! అంటూ పరుగులు కూడా పెడుతున్నారట! ‘బస్ బిపాసా..బస్’ అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నా వినక తన గురించి తను గొప్పలు చెప్పుకుంటోందిట. బాలీవుడ్డే కాదు, హాలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ తెలుగులోనూ ఓ మెరుపు మెరిసిన విషయం తెలిసిందే. భాషాబేదం లేకుండా అన్ని భాషల్లో తానేంటో నిరూపించుకోవాలన్నదే ఈ అమ్మడి లక్ష్యమట! ఈ విషయం గురించే బిపాసా చెబుతూ- ‘‘అవును.. అన్ని భాషల్లో నటించినప్పుడే నటిగా మనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. క్యారెక్టర్ ఏదైనా సరే..అది ఎలా పోషించామన్నదే ముఖ్యం. నటనకు అన్ని భాషలు ఒక్కటేనన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అన్ని భాషల్లో మనమేంటో నిరూపించుకోవాలి’’ అంది. నిజమే..నటనకు భాషాబేదం లేదు కదా!