S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( సెప్టెంబర్ 18 నుండి 24 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆకస్మిక నిర్ణయాలు మంచి లబ్ధినిస్తాయి. సంతాన సౌఖ్యం. తీర్థయాత్రలు చేస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల వారు కావలసినవి సమయానికి అందక ఇబ్బందులున్నా మీ గమనంలో ముందుంటారు. వివిధ రంగాల్లో ప్రవేశించి గుర్తింపును పొందుతారు. లోగడ పూర్తికాని పనులు పూర్తవుతాయి. నూతన వాహన ప్రాప్తి. ధన గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధువర్గంలో ఆధిక్యత పెరుగుతుంది. సంఘ కార్యక్రమములందు ఉత్సాహంతో పాల్గొంటారు. ముఖ్యమైన సమాచారం అందుతుంది. బాకీలుంటే అధిక భాగం నివృత్తి చేసుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన ఆభరణాలు ఖరీదు చేయనున్నారు. కొన్ని అనవసర ఖర్చులకు ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకై సమయం కేటాయించవలసి వస్తుంది. ఆదాయ వ్యయాలు మెరుగవుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. దంపతుల మధ్య అవగాహన మెరుగవుతుంది. సకాలంలో పైకం అందలేదని వ్యాకులత వద్దు. అన్ని సర్దుబాట్లు, దిద్దుబాట్లుంటాయి. పొరపాట్లు తెలిసి చేయకండి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ప్రయత్న పూర్వకంగా కార్యసిద్ధి. వ్యవహారానుకూలత ఉంది. వృత్తి, విద్య, వ్యాపార, కళా, పత్రికా రంగాల వారు అనుకున్న ఆదాయాన్ని అందుకుంటారు. పొదుపు పథకాలందు పెట్టుబడి పెడతారు. అవరోధాలు లేకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండాలి. బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభకార్యాలందు మార్గదర్శకత్వం వహిస్తారు. గతంలో జరిగిన విషయాలను పునః సమీక్షిస్తారు. ధన లావాదేవీలు మెరుగవుతాయి. కార్యాల పట్ల అశ్రద్ధ వద్దు. ఓ వర్తమానం సంతోషాన్నిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

సాంఘిక కార్యాలందు పాల్గొంటారు. ఆరోగ్యం తృప్తికరం. విద్యార్థులు, పోటీ పరీక్షలకు తయారవుతున్న వారు అందిన అవకాశాలను వినియోగించుకోవాలి. సమస్యలను తెలివితో పరిష్కరించుకుంటారు. దంపతులు అనుకున్నవి సాధించుకొంటారు. ఆదాయ లావాదేవీలు తృప్తికరం. హితుల సహాయంతో బకాయి పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అన్నింటా ముందుండి ప్రత్యేక గుర్తింపును పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఫలవంతమవుతాయి. పెట్టుబడులకు వనరులు అందుతాయి. సంతృప్తికరంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభప్రదం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

నూతన ఆలోచనా సరళితో కార్యసిద్ధి. ఆదాయ లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. విందు వినోదాలందు మిత్రులతో కలిసి పాల్గొంటారు. అరకొర పనులు మెల్లగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు శ్రమైక ఫలితం. పెద్దల సలహాలు సంప్రదింపులతో మీ మార్గం సుగమమవుతుంది. ఉద్యోగ వ్యవహారాలు కొత్త అనుకూల మార్గాలకై మలుపులు తిరుగుతాయి. కోర్టు వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు సామరస్య ధోరణిలో ఉంటాయి. మార్గదర్శకత్వం అన్నింటా వ్యవహరించాలనుకుంటారు. వాహన ప్రమాదాలు లేకుండా వ్యవహరించాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

పట్టుదల, నేర్పరితనంతో పనులు పూర్తి చేస్తారు. ఈ వారం అన్నింటా సంతృప్తికరంగా ఉంటుంది. హోటల్స్, ఆటోమొబైల్స్, వైద్య, చిరు వ్యాపారస్థులు, స్టేషనరీ వ్యాపారాలు, కిరాణా, రిటైల్, హోల్‌సేల్, ఏజెన్సీ రంగాల వారు వ్యాపార విస్తరణకు అవకాశాలున్నాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. దీర్ఘకాలిక లాభాలకై స్పెక్యులేషన్ అనుకూలత. బృహత్తర కార్యక్రమాలకు ప్రణాళికలు వేసి అమలు చేయనున్నారు. అప్రమత్తత, నియంత్రణ అన్నింటా అవసరం. మాట పట్టింపులకు గురికాకుండా చూసుకోవాలి. శుభకార్యాలకు మాట సాయం చేస్తారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అనాలోచితంగా పనులు చేయవద్దు. ఆదాయంకన్నా వ్యయం అధికమవుతుంది. పైకం సమయానికి సర్దుబాటు అవుతుంది. డబ్బు లావాదేవీలందు పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. స్ర్తిల సాయంతో అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. మిత్రుల విషయాల్లో మీరు మార్గదర్శకత్వం వహిస్తారు. వృత్తి, వ్యాపార విస్తరణలకు స్థల మార్పులకు అవకాశాలున్నాయి. రావలసిన బాకీలు దఫాల వారీగా వసూలవుతాయి. దంపతులు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దు. ఇతరుల సొమ్ము బరువు అనే భావంతో ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

పట్టుదల, సంయమనంతో కార్యసిద్ధి. వ్యవసాయ, వైవిధ్య కార్యక్రమాలను పునః సమీక్షించుకోవాలి. చాయ్, కాఫీ, తినుబండారాల రంగాల వారికి గిరాకీ అధికమవుతుంది. ప్రమాదాలకు గురికావద్దు. నేర్పు, ఓర్పులతోనే పనులు పూర్తి చేసుకోవాలి. వృత్తి, విద్య, సాంకేతిక రంగాల వారు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు పర్మినెంట్‌కు అవకాశముంది. కోర్టు వ్యవహారాలు మలుపు తిరుగుతాయి. స్ర్తిలు అనుకున్న ఫలితాలు పొందుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

నేర్పుతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలను మించవచ్చు. యాత్రలు, విందులందు బంధుమిత్రులతో కలసి సందడి చేస్తారు. ప్రయాణాలు అనుకోని విధంగా ఉంటాయి. ఎదురుచూస్తున్న పరిణామాలు ఆలోచింపజేస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చిరుద్యోగులు, చిరు వ్యాపారస్తులు, రాజకీయ, సినీ రంగాల వారు, ట్రావెల్స్ రంగం వారు అనుకున్నది అందుకుంటారు. శుభకార్యాలు, ముఖ్యమైన పనులకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

నిర్దేశాల కనుగుణంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శుభకార్యాలకు మార్గ నిర్దేశకత్వం చేస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పోటీ తత్వం, అనే్వషణ అన్నింటా అలవరచుకోవాలి. అతిగా ఎవరినీ నమ్మకండి. భాగస్వామ్య వ్యవహారాలు, చర్చలు ప్రయోజనకారిగా ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు కొత్త ప్రదేశాలు పరిశీలించుకుంటారు. విఘ్నాలు లేకుండా ముందుకు సాగండి. ఆరోగ్య విషయాల్లో పరిధులు దాటకండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలానికి అనుకూలిస్తుంది. అనుకోకుండా పైకం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో బంధాలు మెరుగవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతారు. విలువైన పత్రాలు చేజారే అవకాశముంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం తృప్తికరం. మంచికి పోవటం హితకరం. ఇతరులను ఇబ్బంది పెట్టడం బాధాకరమని గ్రహించండి. ఐరన్, స్టీల్, స్టాక్‌మార్కెట్, వస్తు, వస్త్ర వ్యాపారులు అనుకోని లాభాలందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలందు విజయాన్ని అందుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ముందు పనులు వెనుక, వెనుక పనులు ముందు చేసే అవకాశాలున్నాయి. అన్నింటా ఆలోచన నియంత్రణతో మెలగాలి. బంధువుల రాక ప్రయోజనకరం. వారితో చర్చలు హితకారి. ఆహార విహారాలందు అప్రమత్తత అవసరం. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థల మార్పులు, ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అంతా ఒకేలా ఉంటారని అనుకోవద్దు. నేటికి రేపటికి ఎంతో మార్పు ఉందని గ్రహిస్తారు. విలువైన వస్తువులను సంగ్రహిస్తారు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855