S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీరూ సహకరించండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వౌలిక వసతుల కల్పనలో భాగస్వాములు కావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ, చికున్ గునియా విజృంభించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చేపట్టే కార్యక్రమాలకు యువ డాక్టర్లు సహకారం అందించాలని ఆయన స్పష్టం చేశారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రసంగిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పల్లె ప్రజలు కలరా, మసూచి, క్షయ, ప్లేగు వంటి వ్యాధులకు గురవుతుంటారని ప్రణబ్ చెప్పా రు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రైల్వే స్టేషన్లు, పోస్ట్ఫాసుల్లో ప్రకటనలు చేయాలన్నారు. యువ డాక్టర్లు ముందుకొచ్చి ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ, వైద్య సదుపాయం కల్పించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో వైద్యుల కొరత అధికంగా ఉందని ఆయన ఆవేదన చెందారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో సర్జన్ల కొరత అధింగా ఉందని స్పష్టం చేశారు.

లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ శత స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ప్రభృతులు