S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇవిగో... ఆధారాలు!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21:కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో సైనికులపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ మరింతగా పెంచింది. 18మంది భారత సైనికులపై దాడి జరిపింది పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులేనన్న విషయాన్ని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్ర ధోరణిని ఏ విధంగా ఎండగట్టాలన్న దానిపై కేబినెట్ భద్రతా కమిటీలో ప్రధాని మోదీ క్షుణ్ణంగా చర్చించారు. అలాగే బిజెపి సీనియర్ నేతలతోనూ సమావేశమైన ఆయన వారితోనూ మాట్లాడారు. పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి ఉరీ దాడికి సంబంధించిన ఆధారాల గురించి తెలిపింది. మరో పక్క ఉరీ దాడి కుట్రదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విస్పష్టంగా ప్రకటించారు. పాకిస్తాన్ కేంద్రంగానే ఉగ్రవాదుల పని చేస్తున్నారని చెప్పడానికి ఉరీ దాడిలో లభించిన ఆధారాలే తార్కాణమని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ పాక్ హైకమిషనర్‌కు తెలిపారు. ఉరీ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా ఉందని వెల్లడించిన జైశంకర్ సంఘటన సంఘటన స్థలంలో లభించిన జిపిఎస్ సహా పలు కీలక ఆధారాలను తెలియజేశారు. ఆధీన రేఖలోని ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి చొరబడ్డారో తెలిపారు. అలాగే దాడి చేయడానికి ఏ మార్గంలో వారు వచ్చిందీ, పాకిస్తాన్ ముద్రలు కలిగిన గ్రెనేడ్ల గురించీ వివరించారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఉరీ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న విషయం తిరుగులేకుండా స్పష్టమవుతోందని జైశంకర్ ఉద్ఘాటించారు. ఈ సీమాంతర దాడులపై దర్యాప్తు చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంటే ఉగ్రవాదుల ఫింగర్ ప్రింట్లు, డిఎన్‌ఎ శాంపుల్స్‌ను ఇవ్వడానికి భారత్ ముందుకొస్తుందని బాసిత్‌కు తెలిపారు. పూంచ్ దాడికి సంబంధించిన ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని, వాటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేది లేదని చెప్పిన పాక్ తాజా దాడి విషయంలో ఏమి చెబుతుందని బాసిత్‌ను జైశంకర్ ప్రశ్నించారు. కాగా, ఈ ఏడాదిలో పఠాన్‌కోట్ నుంచి ఉరీ వరకూ జరిగిన పాక్ ఉగ్రవాద దాడుల వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ విషయంలో ఇంకెంత మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడానికి వీల్లేదని, కఠిన చర్యలతో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వెల్లువెత్తడంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక సమావేశం జరిగింది. 18మంది భారత జవాన్ల మరణానికి కారణమైన ఉరీ దాడిపై ఏ విధంగా స్పందించాలన్న దానిపై ఈ సమావేశంలో అనేక అంశాల్ని చర్చించారు. బిజెపి సీనియర్ నేతలతో కూడా మోదీ విస్తృతంగా చర్చించారు.
చేతల్లో చూపిస్తాం: పారికర్
మిలిటెంట్ల చొరబాట్ల ద్వారా భారత్‌లో కల్లోల పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఇంకెంత మాత్రం సహించేది లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఉరీ దాడి దోషుల్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ‘ఉరీ దాడి బాధ్యుల్ని శిక్షించి తీరుతా’మంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన మాటలకు ఎంత మాత్రం పరిమితం కాదని రక్షణ మంత్రి అన్నారు. అయితే దోషుల్ని ఏ విధంగా శిక్షించాలన్న దానిపై దృష్టి పెట్టామని పేర్కొన్న ఆయన ఉరీ దాడి విషయంలో భారత్ అత్యంత కఠినంగా వ్యవరిస్తుందన్నది తిరుగులేని వాస్తవమన్నారు.