S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇమేజి డామేజీ!

హైదరాబాద్, సెప్టెంబర్ 21: గ్రేటర్ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన సర్కారుపై నగర ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. విశ్వనగరంపై భ్రమలు తొలగిపోతున్నాయి. రాజధాని నగరం నరకంగా మారుతోంది. చివరకు ‘మహా’ హామీలు గుప్పించిన మంత్రి కూడా రాజధాని అనుభవిస్తున్న నరకయాతనపై నిస్సహాయత వ్యక్తం చేస్తున్న దయనీయం. సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న పార్సీగుట్ట ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఇనే్నళ్ల రాజధాని చరిత్రలో తొలిసారిగా సచివాలయం వద్ద ఏర్పడిన భారీ సొరంగం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ కురిసిన వర్షపాతం కొన్ని చోట్ల 16.5 సెంటీ మీటర్లుగా, కుత్బుల్లాపూర్‌లో 23 సెంటీమీటర్లుగా నమోదయింది. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్ నిండిపోయింది. ఆ నీటిని బయటకు పంపేందుకు దిగువభాగంలో ఉన్న అశోక్‌నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు బల్దియా రంగంలోకి దిగింది. 2000 ఆగస్టులో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనగా, బోట్లు ఏర్పాటు చేశారు. వాటర్ వర్క్స్, సీవరేజి, గ్రేటర్ కార్పొరేషన్, రెవిన్యూ, ట్రాఫిక్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. తాజాగా సచివాలయ ప్రాంతంలో రెండడుగుల లోతులో గుంతలు ఏర్పడ్డాయి. కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోందంటే రాజధాని పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టమవుతోంది. నగరంలో నెలకొన్న అస్తవ్యస్త జీవనంపై విపక్షాలు తెరాస సర్కారుపై, ప్రధానంగా మంత్రి కెటిఆర్‌పై విరుచుకుపడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. గుంతలుపడిన రోడ్లపై తెదేపా మొక్కలు నాటితే, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా కాంగ్రెస్ నేత విహెచ్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇవన్నీ గత ఎన్నికల ముందు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.కొత్తగా అభివృద్ధి చేయకపోయినా, ఉన్న రోడ్లను కూడా ఆధునీకరించలేని వైఫల్యంపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చివరకు మంత్రి కెటిఆర్ స్వయంగా తనిఖీ చేసి యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ రోడ్లను తక్షణం బాగు చేయాలని ఆదేశించి చాలా రోజులయినా అవి ఇప్పటికీ దిక్కులేని స్థితిలోనే ఉన్నాయి. ‘నాకు కథలు చెప్పవద్దం’టూ మంత్రి అధికారులను ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడటం చూసిన ప్రజలు సమస్యల పరిష్కారం విషయంలో అందరూ ఎవరి కథలు వారు వినిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
మునిసిపాలిటీ, గ్రేటర్ కార్పొరేషన్ ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని మంత్రి కెటిఆర్ అంగీకరించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీల దుస్థితిపై నిస్సహాయత వ్యక్తం చేశారు. డ్రైనేజీ, స్లూయిజ్, స్టాంవాటర్ వ్యవస్థ ధ్వంసం కావడమే ఈ దుస్థితికి కారణమని చెప్పిన కెటిఆర్, వాటి పరిష్కారానికి కావలసిన 11 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం విమర్శలకు గురవుతోంది. ఇప్పటికే గ్రేటర్ బడ్జెట్ హారతి కర్పూరమయింది. ఆస్తిపన్ను వసూళ్లనుంచి ఆర్టీసి, వాటర్‌వర్క్స్‌కు 15 శాతం ఇవ్వాలని ఆదేశించిన ఫలితంగా వందలకోట్లు మళ్లించాల్సి వస్తోంది. సర్కారు తాను ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, బల్దియా సొమ్మును కూడా ధారాదత్తం చేయడంతో కార్పొరేషన్‌కు నిధులు కరవయ్యాయి. 13వ ఫైనాన్స్ కమిషన్ నుంచి బల్దియాకు వచ్చిన 130 కోట్లు ఇప్పటివరకూ విడుదల చేయలేదు. ఈ పరిస్థితిలో నిధులు లేకుండా నగరాభివృద్ధి ఎలా సాధ్యమన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లభించడం లేదు. ‘కోతలు కోయడమే కెటిఆర్ పని. విశ్వనగరమన్నారు, విశ్వనరకంగా మార్చారు. చెత్తనగరాల పోటీ పెడితే మనకే నెంబర్ వన్ వస్తుంది. ఆయనకు దమ్ముంటే కాలనీలు తిరగాలి. మేము ప్రజా సమస్యలు ప్రస్తావిస్తుంటే మాపై కేసులు పెడుతున్నారు. నమ్మకంతో ఓట్లేసిన జనాలను మోసం చేస్తున్న వైనాన్ని మేం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం’ అని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ వర్షానికి గొయ్య పడిన దృశ్యం