S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డెక్కిన ఉల్లి రైతులు

కర్నూలు, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రైతులు అమ్మే ఉల్లి క్వింటాలు ధర కేవలం రూ.150 నుంచి 200 లోపు పలుకుతుండగా, అదే ఉల్లి ప్రజలు కొనాలంటే కిలోకు రూ.15 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. కర్నూలు మార్కెట్ యార్డుకు భారీ ఎత్తున ఉల్లిని తీసుకువస్తున్న రైతులకు వ్యాపారులు కనీస ధర కూడా చెల్లించడం లేదు. దీంతో ఉల్లి తరలించడానికి వాహనాలకు బాడుగ చెల్లించడానికి కూడా ఆ సొమ్ము సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు బుధవారం ఉల్లిని మార్కెట్ యార్డు వెలుపల రహదారిపై పారబోసి ఆందోళనకు దిగారు. ఉల్లి ధరలు పతనం కావడానికి వ్యాపారుల మాయాజాలం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. బస్టాండు ఎదురుగా రైతులు రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పరిస్థితిని జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయశాఖ మంత్రి ప్రపత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌తో సమీక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం క్వింటాలు ఉల్లిని రూ.600కు కొనుగోలు చేస్తోందని, అయితే తక్కువ పరిణామంలో మాత్రమే కొంటున్నారని మంత్రి దృష్టికి జేసీ తీసుకువెళ్లారు. ఆ వెంటనే ఉన్నతాధికారులతో చర్చించి క్వింటాలు ఉల్లి రూ.700కు కొనుగోలు చేయాలని, అదే విధంగా ప్రస్తుతం కొంటున్న పరిమాణానికి రెట్టింపు కొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని అధికారులు రైతుల దృష్టికి తీసుకురాగా వారు ఆందోళన విరమించారు. కాగా ఉల్లి ధరలు తగ్గిన సమయంలో నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములు, కర్నూలు, ఆలూరు, పత్తికొండలో నిర్మిస్తామని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు. గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని త్వరలో వీటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉల్లి ధరలే కాకుండా టమోటా ధర కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని ఆ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి రైతులకు మేలు చేకూర్చే నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు.