S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంత్రి పల్లె ఘెరావ్

అనంతపురం, సెప్టెంబర్ 21: మంత్రి పల్లె రఘునాథరెడ్డిని బుధవారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద సిపిఎం కార్యకర్తలు ఘెరావ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి పల్లె ఆసుపత్రి ముందునుంచి వెళ్తుండగా సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కారు దిగిన మంత్రి గేటు వద్ద దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ గేయానంద్‌తో మాట్లాడారు. ఆసుపత్రి సమస్యలను ఫోన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే నిర్దుష్ట సమయంలోపు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని గేయానంద్ స్పష్టం చేశారు. ఈక్రమంలో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మంత్రిని అక్కడి నుంచి తరలించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఆందోళనకారులను తప్పించుకుని మంత్రి ఉరుకులు పరుగులమీద కారు వద్దకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గేయానంద్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గేయానంద్‌ను అరెస్టు చేసి ఆసుపత్రిలో చేర్పించారు. కలెక్టర్ హామీతో ఆయన దీక్ష విరమించారు.