S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిరస్మరణీయుడు అష్ట్భాషా కోవిదుడు పిబిశ్రీనివాస్

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: అష్ట్భాషా కోవిదుడిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు పిబి శ్రీనివాస్ అందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ పెనే్నటి స్వప్నహైందవి అన్నారు. ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పిబి శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని గురువారం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వప్నహైందవి మాట్లాడుతూ 1954లో జాతకఫలం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు గాయకుడిగా ఆరంగేట్రం చేసిన శ్రీనివాస్ కొన్నివేల గీతాలను పాడి గానగంధర్వునిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రయాంక, ప్రియభాషి, విశ్వసాక్షి, త్రిలోక సంచారి అనే కలం పేర్లతో పత్రికల్లో రచనలు గావించారని చెప్పారు. కర్ణాటక సంగీతంలో నవనీత సుధ అనే రాగాన్ని సృష్టించారన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ప్రచురించిన పిబి శ్రీనివాస్ జీవిత విశేషాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య వ్యవస్థాపకుడు ఎస్‌విఎన్ గురుప్రసాద్, శ్రీరామ సంగీత నృత్య కళాశాలకు చెందిన గాయని లలితకుమారి, చీపురుపల్లికి చెందిన తెలుగునాడు స్వచ్ఛందసంస్థ వ్యవస్థాపకురాలు విమల పాల్గొన్నారు.