S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగర పాలక సమావేశం రసాభాస.!

కడప,సెప్టెంబర్ 23: కడప నగర పాలక సంస్థలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వైకాపా, టిడిపి పాలక వర్గ సభ్యులు పరస్పరం మాటలయుద్ధానికి దిగారు. దీంతో సభ రసాభాసగా మారింది. వైకాపానేత, నగర పాలక మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన సమావేశం జరిగినా ఆయన పెద్దగా నోరుమెదపలేదు. ఇరుపార్టీలకు చెందిన కార్పొరేటర్లు నగరంలోజరిగిన అభివృద్ధి పనులు నాసిరకంగా జరిగాయని అధికారులపై విరుచుకుపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా మాట్లాడుతూ నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ నాసిరకమేనని అధికారపార్టీ నేతలకే అధికారులు వత్తాసు పలుకుతున్నారని అధికారులపై విరుచుకుపడుతూ అవినీతి అధికారులు రాజీనామాచేసి వెళ్లాలని, ప్రజలు అభివృద్ధి కోరుతుంటే అధికారులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ధ్వజమెత్తారు. వైసిపి కార్పొరేటర్లు బి.పద్మావతి, మహ్మద్ అలీ, రామలక్ష్మణ్‌రెడ్డిలు ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా రాలేదని తమ పార్టీ ఆధీనంలో పాలకవర్గం ఉన్నా తమ డివిజన్లలో అభివృద్ధి పనులు జరగడం లేదని టిడిపి కార్పొరేటర్లపై విరుచుకుపడ్డారు. ఒక దినపత్రికను వైసిపి నేతలు చూపుతూ అధికారపార్టీ నేతల ఆగడాలు, నాసిరకం పనులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆ దినపత్రికను టిడిపి నాయకులకు చూపుతూ విరుచుకుపడ్డారు. టిడిపి కార్పొరేటర్లు కె.పి.విశ్వనాధరెడ్డి, పి.సురేష్, చైతన్య దీటుగా స్పందించారు. దీంతో ఇరుపార్టీల కార్పొరేటర్ల మధ్య మాటలయుద్ధం, ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఇరుపార్టీలు కలిసి అధికారులపై మండిపడ్డారు. మేయర్ కె.సురేష్‌బాబు అధికారులతో వచ్చిన నిధులను ప్రభుత్వం నుంచి రావాల్సిన మరో రూ.4కోట్లు తెప్పించి అభివృద్ధి చేసుకోవాలని సలహా ఇచ్చారు. మాటమాటకు టిడిపి, వైకాపా కార్పొరేటర్లు వ్యక్తిగత దూషణలతోపాటు పార్టీలపై విరుచుకుపడ్డారు. అదేవిధంగా అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని ఇరుపార్టీల కార్పరేటర్లు ఆగ్రహం వ్యక్తదం చేశారు. స్పందించిన కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, మిగిలిన అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకే నాణ్యమైన పనులు చేపడుతున్నామని, ప్రొటోకాల్ పాటిస్తున్నామని చీటికిమాటికి అధికారులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. టిడిపిలోకి వైకాపా కార్పొరేటర్లు చేరగా టిడిపి కార్పొరేటర్ల బలం పెరిగి వైసిపి కార్పొరేటర్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా ధ్వజమెత్తిన విధంగానే వాడి వేడిగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓ దశలో మేయర్ అవాక్కై ప్రేక్షకపాత్ర వహించాల్సివచ్చింది. అందరూ కలిసి అధికారులపై ధ్వజమెత్తారు. దీంతో అధికారులు కినుక వహించారు.