S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పచ్చదనాన్ని కొనసాగించాలి

గుంతకల్లు, సెప్టెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనాన్ని కొనసాగించాలని రైల్వే డివిజినల్ మేనేజర్ అమితాబ్‌ఓజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశ భవనంలో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం కింద చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనం మరింత విస్తతంగా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వే కాలనీలు, రైళ్లలో సైతం పరిశుభ్రత పాటించాలన్నారు. రైల్వేలో ఈనెల 17 నుండి 25 వరకూ జరిగే స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని దాదాపు 86 మంది అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఆర్‌ఎం సుబ్బరాయుడు, పర్యావరణ, పరిశుభ్రత సీనియర్ డిఎంఇ సుబ్రమణ్యం, సిఎంఎస్ డాక్టర్ ప్రకాష్, నజీర్‌హుసేన్, సిఎన్‌డబ్ల్యూ సీనియర్ డిఎంఇ రమణ, ఎహెచ్‌ఓ సర్దార్‌బాషా తదితరులు పాల్గొన్నారు.