S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అక్రమ కట్టడాలు, లేఔట్లను ఉపేక్షించం

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 23 : మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఔట్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి తులసీరాం నేతృత్వంలో సిబ్బంది శుక్రవారం స్థానిక చౌడేశ్వరి కాలనీలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చివేశారు. అలాగే టీచర్స్ కాలనీలో సర్వే నెంబర్ 389/2ఏ, కొట్నూరులో సర్వే నెంబర్ 62, 66/1ఎ2, దండురోడ్డులో సర్వే నెంబర్ 361/2తోపాటు సర్వే నెంబర్లు 431/7, 431/11లలో వేసిన అక్రమ లేఔట్లను తొలగించారు. ఇకపై ఎవరైనా అక్రమంగా లేఔట్లు వేయడం, ఇళ్ల నిర్మాణాలు చేయరాదన్నారు. అక్రమ లేఔట్ల వల్ల మున్సిపాలిటీకి ఆదాయం రాకపోగా కొనుగోలు చేసిన ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా లేఔట్లు వేసే వ్యక్తులు అనుమతి తీసుకోవాలన్నారు. అదే విధంగా భవన నిర్మాణాలు చేసే వ్యక్తులు కూడా ప్రభుత్వం పేర్కొన్న తరహాలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేసుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. తప్పనిసరిగా మున్సిపాలిటీ అనుమతి తీసుకుని అందుకు అనుగుణంగా కార్యకలాపాలు చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. లేనిపక్షంలో మున్సిపల్ చట్టానికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.