S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ.20 లక్షల టర్నోవర్ వరకూ జిఎస్‌టి మినహాయింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేంద్రం శుక్రవారం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా ఇక్కడ సమావేశమవుతున్న జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)నుంచి మినహాయింపునకు ఎంత ఆదాయ పరిమితి నిర్ణయించాలనే దానిపై చర్చించింది. ఆదాయ పరిమితిని రూ.20 లక్షలుగా నిర్ణయించినట్లు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా అన్ని సుంకాలను జిఎస్‌టిలో విలీనం చేయాలని కూడా కమిటీ
తీర్మానించినట్లు తెలిపారు. ఈ నెల 30న జరిగే కౌన్సిల్ తదుపరి సమావేశంలో మినహాయింపులు మంజూరుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఖరారు చేస్తామని, అక్టోబర్ 17నుంచి మొదలయ్యే కౌన్సిల్ మూడు రోజుల సమావేశంలో జిఎస్‌టి రేటు, పన్ను శ్లాబ్‌లను నిర్ణయించడం జరుగుతుందని జైట్లీ తెలిపారు.
కాగా, రూ.1.5 కోట్లకన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉండే అసెస్సీల అసెస్‌మెంట్ అధికారం రాష్ట్ర అధికారులకు ఉండాలని, అలాగే రూ.1.5 కోట్లకు పైబడి వార్షిక ఆదాయం ఉండే అసెసీలపై అధికారం కేంద్ర అధికారులకు ఉండాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు జైట్లీ చెప్పారు. అయితే ద్వంద్వ కంట్రోల్ లేకుండా చూడడం కోసం కేంద్రం, లేదా రాష్ట్రఅధికారులనుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం 11 లక్షలకు పైగా ఉన్న సర్వీస్ టాక్స్(సేవా పన్ను) అసెసీలపై అసెస్‌మెంట్‌కు సంబంధించిన అధికారం కేంద్రానికే ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. ఈ జాబితాలోకి కొత్తగా చేరే అసెసీలను కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. జిఎస్‌టికి మారడం వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి చెల్లించే నష్టపరిహార చట్టం, నష్టపరిహారం ఫార్ములాకు సంబంధించిన ముసాయిదాను రూపొందించడానికి కౌన్సిల్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నష్టపరిహారాన్ని లెక్కించడానికి బేస్ ఇయర్‌గా 2015-16 ఉంటుందని ఆయన చెప్తూ, పరిహారం చెల్లింపునకు సంబంధించిన ఫార్ములాను కేంద్రం, రాష్ట్రాలు చర్చించి నిర్ణయిస్తాయని తెలిపారు. ఈ నెల 30న జరిగే కౌన్సిల్ సమావేశంలో నష్టపరిహారం ఫార్ములాకు సంబంధించి అధికారులు ప్రజంటేషన్ ఇస్తారని, తదుపరి దాన్ని ఆమోదిస్తారని జైట్లీ చెప్పారు.
కాగా, కొత్త పన్ను విధానం అమలు కారణంగా రాష్ట్రాలు కొల్పోయే ఆదాయానికి బదులుగా నష్టపరిహారం చెల్లిస్తున్నందున ఆ నష్టపరిహారాన్ని నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించాలని కౌన్సిల్ సమావేశంలో స్థూల ఏకాభిప్రాయం వ్యక్తమయిందని జైట్లీ చెప్పారు. మూడు నెలలకోసారి, లేదా ఆరునెలలకోసారిగా ఈ చెల్లింపు ఉండాలనే అభిప్రాయం వ్యక్తమయిందని ఆయన చెప్పారు. అలాగే రాబోయే అయిదేళ్లలో రెవిన్యూ పెరుగుదల నిర్ణయానికి సంబంధించిన విధానంపై కూడా మూడు నాలుగు సూచనలు వచ్చాయని జైట్లీ చెప్తూ, అధికారులు వీటిపై చర్చించి ఏది ఉత్తమమైందో నిర్ణయిస్తారని తెలిపారు. కాగా, జిఎస్‌టి కౌన్సిల్ తొలి సమావేశం విజయవంతమయిందని రెవిన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు. ఇదిలా ఉండగా జిఎస్‌టి అమలు తర్వాత అంతర్రాష్ట చెక్ పాయింట్లను ఎత్తివేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది.