S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆక్వాకు అభయం

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తీర ప్రాంత రాష్ట్రాల్లో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియా, ఇంటర్నేషనల్ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో పనిచేసే ఈ అథారిటీలో సముద్ర ఆహార ఉత్పత్తుల యజమానులు, భాగస్వాములు సభ్యులుగా ఉంటారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సముద్ర ఆహార
ఉత్పత్తుల అంశాలతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన ఇనె్సంటివ్స్ తదితర అంశాలను ఈ ప్రాంతీయ బోర్డు పరిశీలిస్తుందన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతీయ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా కల్చర్ పరిశోధన కేంద్రాన్ని, విశాఖలో ఫిషరీస్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఉత్పత్తులను ఎగుమతులు చేసే వారికి మర్కండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ (ఎంఇఐఎస్) కింద కేంద్రం మంజూరు చేస్తున్న ఇనె్సంటివ్‌లు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులకూ వర్తింపచేయనున్నట్టు మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎంఇఐఎస్ పథకం కింద ఈ ఏడాది ఇనె్సంటివ్‌లు ఇచ్చేందుకు రూ.22వేల కోట్లు కేటాయించిందని, తాజాగా మరో రూ.1,500 కోట్లు అదనంగా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు గల అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. వచ్చే నాలుగేళ్లలో భారత ఆక్వా ఎగుమతుల్లో 60 నుంచి 70 శాతం ఎపి నుంచి జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత్‌లో సుస్థిర రాజకీయ, ఆర్థిక వ్యవస్థలున్నాయని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి తగినంత ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు అగ్ర దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశాయని, భారత్ మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. విశాఖ - చెన్నై కారిడార్, కృష్ణపట్నం - బెంగళూరు కారిడార్ అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు. తద్వారా లక్షలాది ఉద్యోగావకాశాలు యువతకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపెడా చైర్మన్ ఎ జయతిలక్, ఎంపి కంభంపాటి హరిబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వి పద్మనాభం, ఎపి రీజియన్ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన సంస్థలకు అవార్డులు అందజేశారు.

చిత్రం.. సీ ఫుడ్ షోలో చేపల నమూనాలను తిలకిస్తున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రి కామినేని