S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జలకల్లోలం!

అడ్డూఆపూ లేని వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. శుక్రవారం వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లా ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, సికింద్రాబాద్‌లో ఒకరు మరణించారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో అత్యధికంగా 25సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో 48 పురాతన భవనాలను కూల్చివేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం 98 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. వరద ప్రవాహం కారణంగా వరంగల్-కరీనగర్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలనూ భారీ వర్షాలు ముంచెత్తాయి.

చిత్రం.. వరంగల్- కరీంనగర్ రహదారిని ముంచెత్తిన వరద